30న బీఆర్ఎస్ నిరసన.. కేటీఆర్ ఏం చెప్పారంటే..?

కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం సమయంలో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం కీలకపాత్ర పోషించిందని, నాడు వారి పోరాట పటిమ అందరికీ స్పూర్తి అన్నారు. అలాగే సమాజానికి మంచి చేయడంలో విద్యార్థి విభాగం ఎప్పుడూ ముందుండాలని, ప్రజల పక్షాన పోరాటం చేయాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చామని, రాష్ట్రాన్ని అభివృద్ది పరిచామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం ప్రగతిపథంలో నడిచిందని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంతా తిరోగతి వైపు పయనిస్తుందన్నారు. 5 మెడికల్ కాలేజీలు ఉంటే, తమ హయాంలో 33 కాలేజీలు చేశామన్నారు.

 

ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మనం చేసిన అభివృద్దిని కాంగ్రెస్ చేసినట్లుగా ప్రచారం చేసుకుంటోందని, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారన్నారు. రేషన్ కార్డులు ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయమా అంటూ ప్రశ్నించిన కేటీఆర్, గతంలో మీసేవ ద్వార దరఖాస్తు చేసుకున్న అందరికీ నూతన రేషన్ కార్డులు అందించమన్నారు. జనవరి 30న మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రాలు అందజేస్తామని, ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *