ఆంధ్రప్రదేశ్ లో పలు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు శంఖారావం మోగింది. ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్, డిప్యూటీ మేయర్ల ఎంపికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ విడుదలైంది. పలు మున్సిపాలిటీల్లో ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్, డిప్యూటీ మేయర్ల ఎంపికకు ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ ఎలక్షన్స్ కు తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఈ నెల 30లోగా సమావేశం ఏర్పాటు చేయాలని.. ఫిబ్రవరి 3న ఎన్నిక జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎన్నికల్లో TPTY, NLR, ఏలూరు కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు. నందిగామ, హిందూపురం, పాలకొండలో ఛైర్పర్సన్స్ కు ఎన్నికలు జరగనుండగా.. బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్లలో వైస్ ఛైర్పర్సన్ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరిగి పూర్తవ్వకముందే రాష్ట్రంలో మరో ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. తాజాగా మున్సిపల్ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులు భర్తీ కోసం ఎన్నికలు నిర్వహించేందుకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 3న జరగబోతున్న ఎన్నికలకు ఆయా ప్రాంతాల కలెక్టర్లు ఏర్పాట్లు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్రంలో రెగ్యులర్ మున్సిపల్ ఎన్నికలకు మాత్రం ఇంకా గడువు మిగిలే ఉండటంతో… అప్పటి వరకూ ఈ ఎన్నికల్లో ఎన్నికైన వాళ్లు ఆయా పదవుల్లో కొనసాగుతారు.