ఒక్కడే… ఒక్కడిగా మొదలయ్యాడు కోట్ల మందికి స్పూర్తిగా నిలిచాడు

J6@Times//నిండా పాతికేళ్లు కూడా లేని వయసులో అభాగ్యుల ఆకలి గురించి ఆలోచించాడు. అనుకున్న దారిలో అడుగు వేశాడు. కోట్ల మంది ఆకలి తీర్చి హీరో అయ్యాడు.
అతనే అంకిత్‌_కవాత్రా.

దేశ రాజధానిలో మొదలైన అతని ప్రయాణం దేశంలోని 43 నగరాలకు, పట్టణాలకు విస్తరించింది.
పెళ్ళిలో పడిన తొలి అడుగు…

ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి, విలాసవంతమైన జీవితం గడుపున్న ఓ కుర్రాడు అకస్మాత్తుగా అనార్ధుల ఆకలి గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. దానికి తొలి అడుగు పడింది కూడా ఓ పెళ్ళిలో.

2014 ఆగస్టులో అంకిత్ ఓ సెలెబ్రెటీ పెళ్ళికి వెళ్ళాడు. పెళ్ళికి వచ్చిన అతిధులకు అద్భుతమైన విందు ఏర్పాట్లు చేశారు. దాదాపు 35 రకాల వంటలు చేశారు. భోజనం చేస్తుండగా క్యాటరింగ్ అతనితో మాటా మాటా కలిపాడు.

ఎంతమంది వచ్చారని అడిగితే.. క్యాటరింగ్ అతను “వెయ్యి మందే సర్.. కానీ వంటలు మాత్రం 5వేల మందికి చేయించారు” అని చెప్పాడు. 4వేల మంది తినే #ఆహారం_వృధా అయిపోతుండడంతో అంకిత్ కళ్ళు చెమ్మగిల్లాయి.

రోడ్డు మీద ఆకలితో అలమటించే వాళ్ళంతా తన కళ్ల ముందు కనిపించినట్టైంది అతనికి. వెంటనే తేరుకుని ఇక మీదడ ఎక్కడైనా ఫంక్షన్‌లో భోజనం వృధా అయితే తనకి ఫోన్ చెయ్యమని క్యాటరింగ్ అతనికి తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు.

పెళ్లి జరిగిన వారం తిరిగే లోపే అంకిత్‌కి #క్యాటరింగ్ అబ్బాయి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. వెంటనే తన స్నేహితుడిని తీసుకుని పెద్ద పాత్రలను తన కారులో వేసుకుని వెళ్ళాడు. అక్కడ మిగిలిన ఆహారాన్ని తీసుకుని నేరుగా దగ్గరలోని మురికి వాడకి పోనిచ్చాడు.

ఆకలి బాధతో అలాగే పడుకుని ఉన్న వారందరినీ తట్టి లేపాడు. కడుపు నిండా భోజనం పెట్టాడు. వారి కళ్ళల్లో సంతోషాన్ని చూసి తన కర్తవ్యం ఏంటో తెలుసుకున్నాడు. మరుసటి రోజే ఉద్యోగానికి రాజీనామా చేశాడు. #ఆశయం వైపు అడుగులు వేశాడు.

ఒకవేళ ఆశించిన దానికంటే ఎక్కువ భోజనం వస్తే ఎలా అని ఆలోచించాడు. దాన్ని వృధా అవ్వకుండా ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్నాడు.
వెంటనే అన్ని #క్యాంటీన్లు, #రెస్టారెంట్లు, పెద్ద పెద్ద #హోటళ్లు, కంపెనీల వద్దకి వెళ్ళి భోజనం మిగిలితే తనకు ఫోన్ చెయ్యమని అర్ధించాడు.

అర్ధం చేసుకున్నవాళ్లు ఖచ్చితంగా ఫోన్ చేస్తామని చెప్పి అతన్ని మెచ్చుకున్నారు. అర్ధం చేసుకోలేని మూర్ఖులు మాత్రం అవమానించి పంపేశారు. మరి కొందరైతే ప్లేట్‌కి ఇంత అని కొంత డబ్బు ఇస్తేనే ఇస్తామన్నారు.

కార్యాచరణ మొదలయ్యింది…

కాళ్లా వేళ్ళా పడి మిగిలిన ఆహారాన్ని ఇచ్చే కొందరిని సంపాదించాడు. అప్పటి వరకూ తాను కూడబెట్టిన డబ్బుని తీసుకుని ఆహారం నిల్వ ఉండే వాహనం కొనాలనుకున్నాడు. అంకిత్ అంకిత భావాన్ని చూసిన కొందరు దాతలు అతనికి సాయం చెయ్యడంతో వెంటనే 24 గంటలూ ఆహారం నిల్వ ఉంచగలిగే #రిఫ్రిజిరేటెడ్ వాహనం కొన్నాడు.

తన ఆశయాన్ని స్నేహితులతో, గతంలో పని చేసిన సహ ఉద్యోగులతో పంచుకున్నాడు. మానవత్వం ఉన్నవారు అంకిత్‌కి చేయూతనిచ్చారు.
‘#ఫీడ్_ఇండియా’గా ఉద్యమించాడు..
తాను ఉద్యోగానికి రాజీనామా చేసి మూడు నెలలు గడిచే లోపే ‘ఫీడ్ ఇండియా’ అనే సంస్థ స్థాపించాడు.

ఎక్కడ ఆహారం వృధా అవుతుందని తెలిసినా వెంటనే అక్కడికి వెళ్ళి ఆ ఆహారాన్ని #అనాధాశ్రమాల్లోనూ, #వృద్ధాశ్రమాల్లోనూ, ప్రభుత్వ పాఠశాలల్లోనూ, రోడ్డుపై ఆకలితో ఉన్నవారికీ, #వికలాంగులకు నేరుగా అందించ సాగాడు.

తాను చేసే సేవకి త్వరగానే గుర్తింపు వచ్చింది. వెంటనే ‘#డొనేషన్డ్రైవ్స్’ కార్యక్రమాలు నిర్వహించి వాటికి #ఫుడ్బ్లాగర్లను, పెద్ద పెద్ద రెస్టారెంట్ #ఓనర్లను, #బుల్లితెర తారలను పిలిచి అందరికీ తెలిసేలా ప్రచారం చేసేవాడు.

#సోషల్_మీడియాని కూడా విపరీతంగా వాడి ప్రచారం చేసేవాడు. మూడేళ్లలోనే ‘ఫీడ్ ఇండియా’ 43 నగరాలకు, పట్టణాలకు వ్యాప్తి చెందింది.
ఒక్కడిగా మొదలై వేలమందితో…

ఒక్కడిగా అడుగేసిన అంకిత్ తనలాంటి భావాలే ఉన్న ప్రతి వ్యక్తిని తనతో కలుపుకున్నాడు. ఇప్పుడు ప్రతి రోజూ #2వేలకి పైగా తనతో భాగస్వాములవుతున్నారు.

★2030నాటికి ఆకలి లేని భారతాన్ని చూడాలనే కలతో పర్యావరణాన్ని కూడా కాపాడుతున్నారు. వృధాగా మిగిలిన ఆహారం చెత్త కుప్పల పాలై దుర్వాసన వస్తూ వ్యాధులు రాకుండా ఆపుతున్నారు.

#మిథేల్ వాయువు విడుదలయ్యే #గ్లోబల్_వామింగ్ జరగకుండా అడ్డుకుంటున్నారు.
ప్రపంచ దేశాలకు #సెలెబ్రెటీ..
#ఐక్యరాజ్య_సమితి ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన- 2030’ కార్యమానికి 186 దేశాల నుండి సుమారు 18000 మండి పోటీ పడగా అందులో అంకిత్ ఎంపికయ్యాడు.

వందలమంది ప్రపంచ దేశాల నాయకుల మధ్యలో ఆకలి లేని భారతాన్ని ఎలా నిర్మించాలో ఉపన్యాసం చెప్పాడు.

సామాజిక సేవతో పని చేస్తున్న 30ఏళ్ల లోపు యువత కోసం ఓ ప్రముఖ మ్యాగజైన్ రూపొందించిన జాబితాలోనూ అంకిత్‌కు గౌరవ స్థానం దక్కింది.

#బ్రిటన్_రాణి తన సింహాసనాన్ని అధిష్టించి 60
ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా సామాజిక సేవ చేస్తున్న 30 ఏళ్ల లోపు యువకుల్ని పురస్కరించాలనుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వారు ఎంపిక చేసిన 60మంది యువకుల్లో మన అంకిత్ కూడా ఉన్నాడు.

రాణీ ఎలిజబెత్ చేతుల మీదగా అవార్డు అందుకున్నారు. ప్రపంచ దేశాలన్నీ మన దేశం వైపు చూసేలా చేసిన అంకిత్ అంకిత భావాన్నీ మెచ్చుకోకుండా ఉండగలమా…

మరెందరో అంకిత్‌లు దేశం కోసం ముందుకి రావాలని ఆశిస్తూ, అంకిత్‌లా సమాజ సేవ చేసే ప్రతి ఒక్కరినీ అభినందించి చేయూతనిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *