బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫార్ములా – ఈ కారు రేసింగ్ కేసులో ఆయన ఈ నెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.
తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ కేటీఆర్ తొలుత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, అందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేశారు. కేటీఆర్ పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
మరోపక్క తెలంగాణ సర్కార్, ఏసీబీ సుప్రీం కోర్టులో ఇప్పటికే కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు ఉపశమనం లభిస్తుందా? లేదా? అనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.