వింత శిశువు జన్మిచింది ఆదోనిలో

ఆదోనిలో వింత శిశువు జన్మిచింది. వింత ఆకారంలో పుట్టిన ఈ ఆడ శిశువు ఆరోగ్యంగానే ఉండని డాక్టర్లు తెలిపారు. ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామనికి చెందిన రాధా,గంగాధర్ దంపతులకు వింత శిశువు జన్మిచింది. రాధా దంపతులకు నాలుగో కాన్పులో ఈ వింత శిశువు జన్మిచింది. కాగా రాధా దంపతులకు మొదటి సంతానంగా పుట్టిన బిడ్డ కూడా వింత ఆకారంలోనే ఉందని కానీ ఆ బిడ్డ పుట్టని ఐదు రోజులకే మరణించిందని తెలిపారు. ఇప్పుడు నాలుగో కాన్పులో కూడా ఇటువంటి వింత బిడ్డే జన్మించటం గమనించాల్సి విషయం. జీన్స్ లోపాలవల్ల ఇలా పుట్టడం జరుగుతుందని డాక్టర్ తెలిపారు.

 

తెలిపారు. కానీ మొదటిసారే అటువంటి బిడ్డ జన్మించినప్పుడే సదరు దంపతులు నిపుణులను సంప్రదించి ఉంటే బాగుండేదని సూచించారు. వింత శిశువుకు చర్మం పగిలిపోయినట్లుగా రక్తం స్రవిస్తున్నట్లుగా ఉంది. అంతేకాదు కోరపళ్లు, వకంర కాళ్లతో పగిలిన చర్మంతో శిశువు జన్మించింది. ఈ బిడ్డ ఆరోగ్యంగానే ఉండటంతో బిడ్డకు మెరుగైన చికిత్స కోసం కర్నూలు తరలించాలని డాక్టర్లు సూచించారు. ఇటువంటి బిడ్డలు లక్షల్లో ఒక్కరు ఇలా జన్మిస్తారని డాక్టర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *