తిరుపతి: శరీరంలో ఇమ్యూనిటీని పెంచే మందు కావున ఆనందయ్య మందును ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఆనందయ్య మందు పంపిణీని ప్రారంభించిన అనంతరం భాస్కర్ రెడ్డి మాట్లాడారు. నియోజకవర్గంలోని 1.60 లక్షల ఇండ్లకు మందును పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. ఆరు మండలాలలోని వలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రివెంటివ్ మెడిసిన్‌ను అందజేస్తామన్నారు. ఇమ్యూనిటీని పెంచే మందు కావున ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చన్నారు. ఈ మందుతో సైడ్ ఎఫెక్ట్స్ లేవని నిపుణులు తేల్చిన తరువాతే వారి కుటుంబ సభ్యుల ద్వారానే మందును తయారు చేయించామని ఆయన పేర్కొన్నారు. తన నియోజకవర్గంలోని ప్రజల బాగోగులను చూడడం తన బాధ్యత అని భాస్కర్ రెడ్డి ప్రకటించారు.