హైదరాబాద్: దుబ్బాక నియోజకవర్గంలో నిర్మాణాలు పూర్తైన రెండు పడక గదుల ఇండ్ల కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3 కోట్లు మంజూరు చేశామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ చేతుల మీదుగా దుబ్బాక పట్టణ 2BHK ఇండ్ల ప్రారంభోత్సవం.. జులై 10 లోగా ఇండ్లను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని సూచించారు. లబ్దిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా రెవెన్యూ అధికారులు చేపట్టాలన్నారు. రైతులకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫలాలు అందాలంటే డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణం తప్పనిసరన్నారు. ప్రధాన సాగునీటి కాల్వల నిర్మాణం ఇప్పటికే పూర్తి చేశామని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా సమిష్టిగా కాల్వల భూసేకరణకు ప్రజా ప్రతినిధులు సహకారం అందించాలన్నారు