పెళ్లి..జీవితంలో ఓ మధురమైన ఘట్టం. మరిచిపోలేని విధంగా తమ పెళ్లి

Bride Cancels Wedding :చేసుకోవాలని కొంతమంది అనుకుంటుంటారు. వినూత్నంగా వివాహం చేసుకుంటారు. అయితే..కొన్ని పరిస్థితుల్లో పెళ్లి పెటాకులు అయిపోతుంటాయి. అర్ధాంతరంగా వివాహాలు ఆగిపోతాయి. ఓ పెళ్లిలో డ్యాన్స్ చేయాలని వధువును కోరడం, ఆమె నో చెప్పడంతో…తాగి రచ్చ రచ్చ చేశాడో ఓ వరుడు. చివరకు పెళ్లి కాస్తా..ఆగిపోయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

తిక్రీ గ్రామంలో ఓ రైతు కుమార్తె వివాహం రవీంద్ర పటేల్ తో నిశ్చయమైంది. పెళ్లికి అన్ని ఏర్పాటు చేశాడు. పెళ్లి రోజున ఫుల్ గా మందు సేవించి వరుడు, అతని స్నేహితులు మంటపం వద్దకు వచ్చారు. ఇది మంచి పద్ధతి కాదని వధువు కుటుంబసభ్యులు మందలించారు. అయినా వినిపించుకోలేదు. పెళ్లికి కొద్ది నిమిషాల ముందు..వధువును డ్యాన్స్ చేయాలని వరుడు డిమాండ్ చేశాడు. బలవంతం చేయడంతో..వధువు కోపం తెచ్చుకున్నారు. చేయనని ఖరాఖండిగా చెప్పడంతో వరుడు బీభత్సం సృష్టించాడు.

అతని ప్రవర్తనకు విసుగెత్తిన వధువు పెళ్లికి నిరాకరించింది. ఈ సమాచారం కాస్తా పోలీసులకు చేరింది. అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరువురి కుటుంబాలతో మాట్లాడారు. పెళ్లికి ముందు తీసుకున్న నగదు, ఇతరత్రా వస్తువులను వధువు కుటుంబానికి ఇచ్చేందుకు వరుడి ఫ్యామిలీ ఒప్పుకుంది. సమస్య పరిష్కారమైనా..పెళ్లి మాత్రం జరగలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *