దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (సోమవారం) లాభాలు ఆర్జించాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు ఓ దశలో నష్టాల్లోకి జారుకున్నాయి.. 52,231 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ చివరకు 228 పాయింట్లు ఎగబాకి 52,328 వద్ద ముగిసింది. ఇక,15,725 వద్ద రోజును ప్రారంభించిన నిఫ్టీ 81 పాయింట్లు లాభపడి 15,751 వద్ద స్థిరపడింది.
అదానీ పోర్ట్స్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎన్‌టీపీసీ, శ్రీ సిమెంట్స్ లాభాలను ఆర్జించాయి. బాజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సెర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, దేశీయంగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడం, పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడం మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి.