హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ మరియు సూర్యాపేట ఆక్యుపెన్సీలపై జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్ఓలు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల సూపరిండెంట్ల తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ ఆయా జిల్లాలలో నెలకొన్న కోవిడ్ పరిస్ధితులను సమీక్షించి, కేసులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాలు, గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, కోవిడ్ నివారణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు.
సరిహద్దు గ్రామాలపై దృష్టి సారించి నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశిచారు.ఈ టెలికాన్ఫరెన్స్ లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, శ్రీనివాస్ రావు, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్ డి డా. గంగాధర్ లు పాల్గొన్నారు.