కడ్తాల్, మహేశ్వర కైలాసపురి పిరమిడ్ క్షేత్రంలో పి.ఎస్.ఎస్ ఎమ్ పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో ఘనంగా పిరమిడ్ మహా ధ్యాన యాగ చక్రాలు నిర్వహించారు.ఈ యొక్క పిరమిడ్ మహా ధ్యాన యాగ చక్రాల్లో పాల్గొన్న బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్, కంటెస్టెంట్ ఎమ్మెల్యే, ఎంపీ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ పిరమిడ్ మహా ధ్యాన యాగ చక్రాల్లో పాల్గొనడం ఎంతో ఆనందదాయకంగా ఉందని ఇలాంటి వేడుకలకు వివిధ రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి, గ్రామాల నుండి సుమారు పది లక్షల పిరమిడ్ మాస్టర్లు కదలి రావడం పత్రీజీ మహా ధ్యాన యాగ చక్రాల వేడుకలను డిసెంబర్ 21 నుండి 31 వరకు కన్నుల విన్నుల సంబరాలతో జరుపుకోవడం మరియు ఒక మంచి మార్పు కోరుతూ సత్య యుగ ప్రక్షాళనకు నాంది పలుకుతుందని తెలియజేశారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుండి మరియు వివిధ రాష్ట్రాల పిరమిడ్ మాస్టర్లు పత్రీజీ మహాధ్యాన యాగ చక్రాల్లో పాల్గొని పిరమిడ్ జగత్,శాకార జగత్, ధ్యాన జగత్ ఏర్పాటుకు సహకరించి భారతదేశ నలుమూలల జరిగే పిరమిడ్ మాస్టర్ల సమావేశాలను, శాఖాహార ర్యాలీలను విజయవంతం చేయాలని పేరుపేరునా కోరారు. ఈ యొక్క పత్రీజీ మహా ధ్యాన యాగ చక్రాల్లో కైలాసపురి ఇన్చార్జ్ మాధవి మాస్టర్, పి.ఎస్.ఎస్.ఎం అధ్యక్షులు విజయ భాస్కర్ రెడ్డి గారు, కమిటీ సభ్యులు దామోదర్ రెడ్డి, మారం శివప్రసాద్ గారు, రవి శంకర్ మాస్టర్ గారు, సేవాదళ్ అధ్యక్షులు భూపతి రాజుగారు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు ఆనంద్ కుమార్ గారు, బోధన్ సాయిల్ మాస్టర్, సంగారెడ్డి జిల్లా పి ఎస్ ఎస్ ఎమ్ అధ్యక్షులు పి.సంగమేశ్వర్ మాస్టర్ మరియు వివిధ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చిన పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు.