గ్రామ, వార్డు సచివాలయాలకు మరో షాక్..

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలకు కూటమి ప్రభుత్వం మరో షాకిచ్చింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు షాకులు తగులుతూనే ఉన్నాయి. కీలకమైన ఈ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని కూడా సీఎం చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల్లో క్రమశిక్షణ పెంచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సచివాలయాల శాఖ నుంచి కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి.

 

రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరును కఠినంగా పరిశీలించాలని, ఈ మేరకు హాజరుతో వారి జీతాలను లింక్ చేయాలని కూడా ప్రభుత్వం ఈ ఆదేశాల్లో పేర్కొంది. ఇది తప్పనిసరిగా జరిగేలా చూడాలని సచివాలయాలశాఖ డైరెక్టర్ శివప్రసాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. జీఎస్ డబ్ల్యూఎస్ యాప్ లో పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వరకూ, వీఆర్వో గ్రేడ్ 1 ఇలా హాజరు వేయడం లేదని గుర్తించినట్లు తెలిపారు.

 

అలాగే ఎనర్జీ అసిస్టెంట్, వీఆర్వో గ్రేడ్ 2, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5,గ్రామ సర్వేయర్ , వార్డు అడ్మిషన్ కార్యదర్శులు కూడా 30 శాతం నుంచి 50 శాతం మాత్రమే ఇలా బయోమెట్రిక్ హాజరు వేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇలా వీరంతా సకాలంలో సచివాలయానికి రాకపోవడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, వ్యవస్థపై నమ్మకం పోతుందన్నారు. ఇదంతా తిరిగి జిల్లా యంత్రాంగంపై భారం పెంచుతుందన్నారు. కాబట్టి ఇకపై కలెక్టర్లు ఈ విషయంలో డీడీవోలు నిబంధనల మేరకు పనిచేసేలా చూడాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *