సంధ్యా థియేటర్ కేసు అల్లు అర్జున్ మెడకు ఉచ్చులా బిగుసుకుంటుంది. ఈ కేసు ఇప్పుడప్పుడే పరిష్కారం అయ్యేలా లేదు. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యిన విషయం తెల్సిందే. ఈ ఘటనలోనే బన్నీపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. కానీ వెంటనే ఆయన తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా.. వ్యక్తిగత పూచీకత్తుపైన అలాగే రూ.50 వేల బాండ్ పైన అల్లు అర్జున్ కి నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మాత్రమే లభించింది. ప్రస్తుతం బన్నీ బెయిల్ పైనే బయట ఉన్నాడు.
ఇక బెయిల్ బయటకు వచ్చిన బన్నీ.. ఒక ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి .. అసలు ఇందులో ఎవరు తప్పు లేదని, పోలీసులు ఎవరు తనకు మహిళ చనిపోయిందని చెప్పలేదని, నాలాంటివాడు ఎలా ఇలా చేస్తాడు అని ఎమోషనల్ అయ్యాడు. దీనికి తోడు బాధిత కుటుంబానికి కొంత డబ్బు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నామని బహిరంగంగా ప్రకటించడంతో.. అల్లు అర్జున్ పై వ్యతిరేకత నెలకొంది.
బన్నీ వ్యాఖ్యలపై ఏసీపీ కూడా ఫైర్ అయ్యారు. రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి అసలు ప్రెస్ మీట్ ఎలా పెడతారు? తప్పుచేసి తప్పించుకోవడానికి డబ్బును ఎరగా వేస్తున్నారా..? అంటూ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే బన్నీ మధ్యంతర బెయిల్ ను రద్దు చేసినట్లు తెలుస్తోంది.
ఇక అందులో భాగంగానే రేపు ఉదయం 11 గంటలకు బన్నీ కోర్టుకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు పంపారు. బన్నీతో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి కూడా పోలీసులు నోటీసులు పంపడం జరిగింది. మరి ఈ అనుకోని ట్విస్ట్ ను బన్నీ ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి.