ఆంటిగ్వాకు చెందిన పోలీసులు తనను విచక్షణారహితంగా కొట్టినట్లు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ తెలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రుణం ఎగవేసిన కేసులో మెహుల్ చోక్సీ నిందితుడు. ప్రస్తుతం అతను ఆంటిగ్వాలో ఉన్నాడు. అయితే సుమారు 8 నుంచి 10 మంది ఆంటిగ్వాకు చెందిన పోలీసులు తనను చితకబాదినట్లు చెప్పాడు. తనపై దాడి చేసిన వాళ్లు పోలీసులమని చెప్పుకున్నారని చోక్సీ వెల్లడించాడు. ఫోన్, వాచ్, వ్యాలెట్ తీసుకుని తనపై వాళ్లు దాడి చేసినట్లు తెలిపాడు. అయితే తన వద్ద డబ్బును దొంగలించడం ఇష్టం లేదని, మళ్లీ ఆ డబ్బును వాళ్లు వాపస్ ఇచ్చేశారని తన ఫిర్యాదులో చోక్సీ తెలిపాడు. పీఎన్‌బీ కేసులో చోక్సీని ఇండియాకు తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైన విషయం తెలిసిందే. తనను ఎవరో అపహరించాలంటూ చోక్సీ తరపు న్యాయవాదులు పేర్కొనడంతో ఆ ఘటనపై ఆంటిగ్వా ప్రధాని విచారణకు ఆదేశించారు. చోక్సీ లాయర్లు కిడ్నాపర్ల పేర్లు పోలీసులకు చెప్పారని ప్రధాని బ్రౌనీ తెలిపారు.