రెండు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ రెండు భారీ ఈవెంట్స్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన పాన్ ఇండియా పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అమెరికాలో ఈ మూవీకి సంబంధించి నిర్వహించబోతున్న ఈవెంట్ గురించి చర్చ నడుస్తోంది. మరి తెలుగు రాష్ట్రాల్లో ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ జరగబోతున్నాయి అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ తాజా సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషనల్ ఈవెంట్స్ ను ఊహించని విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

 

‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్ల పై దృష్టి సారించారు మేకర్స్. అయితే ముందుగా అమెరికా నుంచి ప్రమోషన్లు స్టార్ట్ చేయబోతున్నారు. అందులో భాగంగానే డిసెంబర్ 21న డల్లాస్ లోని కర్టిస్ కల్వెల్ సెంటర్లో ఈ సినిమాకు సంబంధించిన భారీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ను ప్లాన్ చేశారు. ఇక ఇప్పటికే రామ్ చరణ్ ఈవెంట్ కోసం అక్కడికి వెళ్ళిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మెగా అభిమానుల్లో మరింత జోష్ పెంచే వార్త ఒకటి బయటకు వచ్చింది.

 

ఆ వార్త ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రమోషనల్ ఈవెంట్స్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఒకటి ఏపీలో ఉంటే, మరొకటి తెలంగాణలో ఉండబోతుందని సమాచారం. తెలంగాణలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేతుల మీదుగా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికోసం యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో పర్మిషన్ కోసం చిత్ర బృందం ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టిందట. ఒకవేళ అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈవెంట్ డిసెంబర్ 27న జరిగే ఛాన్స్ ఉంటుందని టాక్ నడుస్తోంది.

 

ఇక ‘గేమ్ ఛేంజర్’కు సంబంధించిన మరో ఈవెంట్ విషయానికొస్తే, ఇది ఆంధ్రప్రదేశ్ లో జరగబోతుంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘గేమ్ ఛేంజర్’ ఏపీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రాబోతున్నారని తెలుస్తోంది. ఈ ఈవెంట్ ను రాజమండ్రిలో నిర్వహించే ఛాన్స్ ఉందని సమాచారం. ఏపీలో ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 4న భారీ ఎత్తున నిర్వహించబోతున్నారని తెలుస్తోంది.

 

మొత్తానికి అల్లు అర్జున్ రికార్డులను బ్రేక్ చేయడానికి తండ్రితో పాటు బాబాయ్ కూడా రామ్ చరణ్ కి తోడవుతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ‘పుష్ప 2’ ఫీవర్ నడుస్తోంది. పైగా ఇంకా అల్లు వర్సెస్ మెగా వివాదం చల్లబడ్డట్టుగా కన్పించట్లేదు. ఇలాంటి టైమ్ లో ఇటు తండ్రి, అటు బాబాయ్ సపోర్ట్ తో వస్తున్న చెర్రీ ‘గేమ్ ఛేంజర్’తో ‘పుష్ప 2’ రికార్డులను బద్దలు కొడతాడా ? అనే ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *