ఫార్ములా రేస్ వ్యవహారం అసెంబ్లీని తాకింది. శుక్రవారం ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. శాసనసభ మొదలు కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఫార్ములా ఈ-రేసు అంశాన్ని చర్చించాలని పట్టుబట్టారు. దీనిపై రకకాల లీకులిస్తూ మా నాయకుడు కేటీఆర్ ఇబ్బందిపెట్టాలని ప్రయత్నిస్తోందన్నారు.
తాము ఎలాంటి తప్పు చేయలేదన్నారు. స్పష్టమైన హామీ ఇస్తేనే సభకు సహకరిస్తామన్ని తేల్చి చెప్పేశారాయన. ఫార్ములా రేసు అక్రమమేనని వెల్లడించారు హరీష్‌రావు. చర్చ పెట్టాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి మాట్లాడారు.
దీనిపై గవర్నర్ అనుమతి ఇచ్చారని, ఏసీబీ కేసు దర్యాప్తు చేస్తోందన్నారు. ఇలాంటి సమయంలో అసెంబ్లీ దానిపై చర్చించే అవకాశముండదన్నారు. ఇష్యూ డైవర్ట్ చేసి, పబ్లిక్‌ను కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఎమ్మెల్యేలు వేసిన ఎత్తుగడగా వర్ణించారు. ఫార్ములా ఇష్యూని శాసనసభలో చర్చించే అవకాశం లేదన్నారు.
దీంతో సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. ఇదే సమయంలో మంత్రి పొంగులేటి సభలో ప్రవేశపెట్టిన బిల్లులపై మాట్లాడుతున్నారు. ఆ సమయంలో స్పీకర్ వెల్ ముందు సభ్యులు ఆందోళనకు దిగారు. సీట్లో కూర్చున్న ఎమ్మెల్యేలను స్పీకర్ వైపు వెళ్లాలంటూ సైగ చేసిన హరీష్‌రావు.
ప్లకార్డులు, పేపర్లు పట్టుకుని స్పీకర్ వైపు దూసుకెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. స్పీకర్‌పై కాగితాలు విసిరారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, కౌశిక్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకునే ప్రయత్నం చేశారు మార్షల్స్. దీంతో కాంగ్రెస్ సభ్యుల వైపు దూసుకెళ్లారు కౌశిక్ రెడ్డి. ఆయన వ్యవహారంపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటకు రండి చూసుకుందామంటూ బెదిరించారు కౌశిక్‌రెడ్డి. ఈ క్రమంలో స్పీకర్ సభను తొలుత 15 నిమిషాల సేపు వాయిదా వేశారు.