‘పుష్ప2’ ఎఫెక్ట్.. సంధ్యా థియేటర్ లైసెన్స్ రద్దు..?

ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు బెడ్ మీదనే ప్రాణాలతో పోరాడుతున్నారు. అల్లు అర్జున్ పర్మిషన్ లేకున్నా కూడా ర్యాలీతో థియేటర్ వద్దకు రావడంతో అభిమానులు ఒక్కసారి గుంపుగా హీరోను చూసేందుకు రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. దాంతో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటన పై ఆమె కుటుంబ సభ్యులు థియేటర్ పై, అల్లు అర్జున్ పై పోలీస్ కేసు పెట్టిన విషయం తెలిసిందే.. చిక్కడపల్లి పోలీసులు మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ ను శుక్రవారం అరెస్ట్ చేశారు. విడుదల చేశారు. ఇప్పుడు సంధ్య థియేటర్ పై కేసు వల్ల ఆ థియేటర్ లైసెన్స్ ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిందని తెలుస్తుంది.. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

 

రేవతి మరణానికి కారణం..?

 

పుష్ప 2 ప్రీమియర్ షోకు హీరో, హీరోయిన్, చిత్ర యూనిట్ వస్తున్నారని, ఇందుకు బందోబస్తు ఏర్పాటు చేయాలని థియేటర్ యాజమాన్యం చిక్కడపల్లి పోలీసులను కోరింది. అయితే హీరో, హీరోయిన్ స్పెషల్ షోకు రావడంతో క్రౌడ్ విపరీతంగా ఉంటుందని.. వారు రావొద్దని థియేటర్ యాజమాన్యానికి రాత పూర్వకంగా చిక్కడపల్లి పోలీసులు బదులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఉత్తర, ప్రత్యుత్తరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి… అల్లు అర్జున్ ను ఈ కేసు పై అరెస్ట్ చేసి మళ్ళీ విడుదల చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ పోలీసుల లేక వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్ దే తప్పు అని వాదన వినిపిస్తున్నాయి.. పోలీసుల మాట విని అల్లు అర్జున్ రాకుండా ఉంటే రేపతి ప్రాణాలతో ఉండేదని కొందరు అంటున్నారు.

 

సంధ్య థియేటర్ లైసెన్స్ క్యాన్సిల్..?

 

హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద గల సంధ్య థియేటర్ లో ఈ ఘటన జరిగింది. పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో ముందు జాగ్రత్తతోనే పోలీసులు హీరో, హీరోయిన్ల పర్మిషన్ కు నో చెప్పారు. పోలీసులు చేప్పినా వినకుండా వచ్చి, అనుమతి లేకుండా హీరో అల్లు అర్జున్ ర్యాలీ చేపట్టారని, ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిందని, ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు వాదించారు. అల్లు అర్జున్ రిమాండ్ వాదనల సమయంలో ఇదే అంశాన్ని పీపీ కోర్టు తెలిపారు.. ఇక థియేటర్ కు తెలియకుండా ఇదంతా జరగలేదని పోలీసులు సంధ్య థియేటర్ పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.. తాజాగా తెలంగాణ సర్కార్ ఈ ఘటనను దృష్టిలో ఉంచుకొని ఆ థియేటర్ లైసెన్స్ ను క్యాన్సిల్ చేసిందని తెలుస్తుంది. ఇక హైదరాబాద్ లో ఈ థియేటర్ ఉన్నా లేనట్లే అని.. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

 

అటు అల్లు అర్జున్ బెయిల్ రద్దు పై సుప్రీమ్ కోర్టును పోలీసులు ఆశ్రయించినట్లు తెలుస్తుంది.సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన మరో కీలక మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టు అల్లు అర్జున్ కు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలని హైదరాబాద్ పోలీసులు సుప్రీం కోర్టుకు వెళ్లనున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *