భూమా అఖిలప్రియ ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? మంచు ఫ్యామిలీ జరిగిన పరిణామాలతో అక్క చెల్లెల్లు ఒక్కటయ్యారా? చాన్నాళ్లు తర్వాత ఆళ్లగడ్డపై అడుగుపెట్టిన మౌనికకు ఏం తెలుసొచ్చింది? రాజకీయ ప్రకటనను ఎందుకు వాయిదా వేసుకుంది? ఆస్తుల చర్చలు ఎంతవరకు వచ్చాయి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
భూమా అఖిలప్రియ ఫ్యామిలీలో ఆస్తుల వ్యవహారం ఎంతవరకు వచ్చింది? అఖిలప్రియ-మౌనిక ఫ్యామిలీలు ఎవరికి వారే తన తల్లి శోభనాగిరెడ్డికి ఘాటు వద్ద నివాళులు అర్పించారు. చాన్నాళ్లు తర్వాత భూమా మౌనిక ఫ్యామిలీ ఆళ్లగడ్డలో అడుగుపెట్టింది.
మొన్నటి ఎన్నికల్లో అఖిలప్రియ తరపున ప్రచారం చేయలేదు మౌనిక. దీంతో అక్కాచెల్లెలు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయనే ప్రచారం లేకపోలేదు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో ఆ ప్రచారానికి బ్రేక్ పడిందనే చెప్పవచ్చు. రీసెంట్‌గా మోహన్‌బాబు ఫ్యామిలీలో విభేదాలు పీక్స్‌కు చేరాయి.
ఫ్యామిలీలో గొడవలకు మౌనికే కారణమని మోహన్‌బాబు ఆడియో రిలీజ్ చేయడంవంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో మౌనిక దంపతులు ఆళ్లగడ్డకు రావడంతో ఏం జరుగుతుందోనన్న చర్చ మొదలైపోయింది. ముఖ్యంగా తల్లి శోభనాగిరెడ్డి పుట్టినరోజు, వర్థంతికి ఘాటుకు వెళ్లి నివాళులు అర్పించేది మౌనిక.
మనోజ్‌ను మ్యారేజ్ చేసుకున్న తర్వాత కేవలం తల్లిదండ్రులకు నివాళులు అర్పించి ఘాటు నుంచి మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లిపోయేది మౌనిక. ఈసారి మౌనిక ఆమె భర్త మనోజ్, ఇద్దరు పిల్లలు వచ్చారు. తన అక్క, ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ ఇంటికి వెళ్లింది మౌనిక ఫ్యామిలీ. మ్యారేజ్ తర్వాత ఇలా ఇంటికి రావడం ఇదే తొలిసారన్నది స్థానికులు మాట.
మౌనిక ఇంటికి వచ్చిన సమయంలో అఖిలప్రియ అధికారిక కార్యక్రమాల నిమిత్తం బయటకువెళ్లారు. సంప్రదాయం ప్రకారం హారతి ఇచ్చి ఇంట్లోవాళ్లు మౌనికను ఇంట్లోకి ఆహ్వానించారు. తన చెల్లి ఇంటికి వచ్చిందన్న విషయం తెలియగానే వెంటనే ఇంటికి వచ్చేసింది అఖిలప్రియ. ఇటు అఖిలప్రియ-అటు మౌనిక ఫ్యామిలీలు కలిసి కూర్చొని భోజనం చేశాయి.
పేరెంట్స్ చనిపోయిన చాలా రోజుల తర్వాత అఖిలప్రియ-మౌనిక-తమ్మడు విఖ్యాత్‌రెడ్డి ఇలా భోజనం చేసి చాలా రోజులు అయ్యిందట. ఈ ముగ్గురు మధ్య దాదాపు రెండు గంటల సేపు ఆస్తుల గురించి చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఆస్తుల వివాదాన్ని సామరస్యంగా పంచుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
ఇప్పుడున్న ఫ్యామిలీ సమస్యలు సద్దు మణిగిన తర్వాత అందరం కూర్చుని మాట్లాడుకుందామని అప్పటివరకు ఎలాంటి విషయం బయటకు పొక్కరాదని సూచన చేసిందట అఖిలప్రియ. దీంతో ఫ్యామిలీ అంతా సైలెంట్ అయిపోయింది. ఇదే సమయంలో మౌనిక-మనోజ్ దంపతుల జనసేనలోకి చేరుతారని, స్పష్టమైన ప్రకటన వస్తుందంటూ జోరుగా ప్రచారం సాగింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియాకు దూరంగా ఉండాలని అఖిలప్రియ సలహా ఇచ్చిందట. దీంతో మౌనిక-మంచు మనోజ్ సైతం దూరంగా ఉన్నారు. ఒకానొక దశలో మీడియా ఈ విషయాన్ని లేవనెత్తినప్పటికీ తప్పించుకునే ప్రయత్నం చేశాడు మనోజ్. జరుగుతున్న పరిణామాలు చూసిన స్థానికులు.. అఖిలప్రియ-మౌనిక మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెబుతున్నారు. మొత్తానికి ఆస్తుల వివాదంలో ఓ అడుగుపడిందనే చెప్పవచ్చు.