తొలిప్రేమ పై స్పందించిన రాజమౌళి..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న రాజమౌళి(Rajamouli) ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా చెలామణి అవుతున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్ (NTR)కాంబినేషన్లో ఆర్.ఆర్.ఆర్ (RRR)సినిమా చేసి ఏకంగా గ్లోబల్ స్థాయి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇకపోతే తాజాగా ఈయన మహేష్ బాబు(Maaheshbabu)తో ‘ఎస్ఎస్ఎంబీ 29’ అనే టైటిల్ తో సినిమాను తెరకెక్కించబోతున్నారు. వచ్చే ఏడాది సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే తాజాగా రాజమౌళి.. రానా దగ్గుబాటి(Rana daggubati) టాక్ షోలో పాల్గొన్నారు. అందులో భాగంగానే ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

 

రానా టాక్ షో లో రాజమౌళి..

 

ముఖ్యంగా రాజమౌళి, రానాతో చిట్ చాట్ లో తన ప్రేమ విషయాన్ని తొలిసారి వెల్లడించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.తన తొలి ప్రేమ ఇబ్బందుల గురించి వెల్లడించారు. అమెజాన్ ప్రైమ్ కోసం రానా ఒక టాక్ షో చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఈ టాక్ షోలో రాజమౌళి ఒక ఎపిసోడ్ కి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇక ఆ సమయంలో రాజమౌళి నుంచి రానా ఎన్నో ఆసక్తికర విషయాలను రాబట్టారు. ఇప్పటివరకు రాజమౌళి ఎవరికీ చెప్పని విషయాలను కూడా రానా, తన షోలో రాజమౌళి చేత చెప్పించడంతో ఇప్పుడు ఈ ఎపిసోడ్ కి మరింత క్రేజ్ పెరుగుతోందని చెప్పాలి.

 

ప్రేమించిన అమ్మాయితో మాట్లాడడానికి ఏడాది సమయం..

 

ఇందులో భాగంగానే రానా మాట్లాడుతూ మీ ప్రేమ గురించి చెప్పమని వెల్లడించగా.. రాజమౌళి మాట్లాడుతూ.. “నేను ఇంటర్ చదువుతున్న సమయంలో ఒక అమ్మాయిని చాలా ఇష్టంగా ప్రేమించాను. అయితే ఆ అమ్మాయితో ఎప్పుడు కూడా మాట్లాడలేదు. మా క్లాస్లో అబ్బాయిలందరికీ కూడా నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నట్లు తెలుసు. వారు మాత్రం నన్ను ఆ అమ్మాయి దగ్గరకు నెట్టుతూ మాట్లాడమని తెగ ఫోర్స్ చేసేవారు. కానీ ఆమెతో మాట్లాడాలంటే నాకు భయం వేసేది. దీంతో నా స్నేహితులందరూ కూడా నువ్వు అమ్మాయితో మాట్లాడలేవు అని, నన్ను ఏడిపించేవారు. ఇక సంవత్సరం మొత్తంలో కూడా ఒక్కసారి మాత్రమే నేను ఆమెతో మాట్లాడను. అది కూడా చాలా కష్టం మీద. ఇక ఆ మాట ఏమిటంటే “ట్యూషన్ ఫీజు కట్టావా” అంటూ మాత్రమే నేను అమ్మాయితో మాట్లాడాను.” అంటూ తెలిపారు రాజమౌళి. ఏడాది పాటు ఆమె చుట్టూ తిరిగాను. అయితే ఆమెతో ఒక్క మాట మాట్లాడడానికి ఎంతో కష్టపడ్డాను అంటూ రాజమౌళి తన తొలి ప్రేమ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం రాజమౌళి చెప్పిన ఈ ప్రేమ విషయం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

 

రాజమౌళికి సపోర్టుగా నెటిజెన్స్ కామెంట్స్..

 

మరి అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంది? ఏం చేస్తోంది? అనే విషయాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. కనీసం ఈ విషయాలు ఆయనకైనా తెలుసో? లేదో? అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం రాజమౌళికి సంబంధించిన ఈ వీడియో వైరల్ గా మారడంతో ఇది చూసిన నెటిజెన్స్ నిజంగానే అప్పట్లో అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడడానికి ఎంతో భయపడేవారు. కొంతమంది స్వేచ్ఛగా మాట్లాడినా.. రాజమౌళి లాంటి మొహమాటం సంవత్సరాల తరబడి అమ్మాయిలు వెంట తిరిగారు. కానీ మాట్లాడేందుకు భయపడే పరిస్థితి ఏర్పడింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా రాజమౌళి తొలిప్రేమ కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *