సినీ నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో నిరాశ ఎదురయింది. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. జల్ పల్లిలోని తన నివాసం వద్ద జర్నలిస్ట్ పై మోహన్ బాబు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి ఘటనలో ఆయనపై పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు… ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. పిటిషన్ ను కొట్టివేసింది.