ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..! విద్యార్ధుల కిట్ లో కీలక మార్పులు..

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా మెగా పేరెంట్స్ – టీచర్స్ మీట్ నిర్వహిం చిన ప్రభుత్వం విద్యార్దుల విషయంలో మరో మార్పు చేసింది. వైసీపీ హయాంలో ఇచ్చిన జగనన్న కిట్ పేరు మార్పు చేస్తూ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్ గా అమలు చేస్తోంది. ఇప్పుడు ఆ కిట్ లో గతంలో యూనిఫాం తో సహా అన్నింటి రంగులను మార్పు చేయాలని డిసైడ్ అయింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇవి అమలు కానున్నాయి.

ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధుల కిట్ లో మార్పులు చేస్తోంది. ప్రస్తుతం అందిస్తున్న యూనిఫాం, బెల్టు, బ్యాగుల రంగులను మార్చాలని డిసైడ్ అయింది. జగన్ సీఎం గా ఉన్న సమయంలో జగనన్న కానుకగా ప్రతీ ఏటా విద్యార్ధులకు యూనిఫాం, షూ, బెల్టు, బ్యాగు అందించేవారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ కిట్లను కొనసాగిస్తూనే… వాటి రంగులను మార్పు చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు విద్యార్ధులకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న యూనిఫాం రంగులు ఇక లేత ఆకుపచ్చ, గులాబీ రంగు పెద్ద గడుల చొక్కా, లేత ఆకుపచ్చ రంగు ప్యాంటుగా ఇవ్వనున్నారు.

అదే విధంగా.. బెల్టుల అంచులకు నలుపు రంగు, మధ్యలో తెలుపు రంగు ఉన్నవాటిని ఇవ్వను న్నారు. ఇప్పటి వరకు అందిన బెల్టుల పై గత ప్రభుత్వం విద్యాకానుక అని ముద్రించి ఉంటుంది. కాగా, ఇప్పుడు మార్పులో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన గ్రాడ్యుయేట్‌ బొమ్మతో కూడిన లోగో తో పంపిణీ చేయనున్నారు. బ్యాగులు సైతం లేత ఆకుపచ్చ రంగులో ఉండేలా డిజైన్ చేసారు. ప్రభుత్వం ఖరారు చేసిన ఈ రంగులతో విద్యార్ధులకు కిట్ లుగా అందించేందుకు టెండర్లను ఆహ్వానిస్తున్నారు. జూన్ 12, 2025 న విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి వీటిని సిద్దం చేయాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని నిర్దేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *