మంచు కుటుంబంలో ఇంత జరుగుతున్నా మంచు లక్ష్మి ముందుకొచ్చి ఈ విషయంపై స్పందించకపోవడంపై అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి. ఎలాంటి పరిస్థితి వచ్చినా తన తమ్ముడికి సపోర్ట్ చేస్తూనే ఉంటానని చెప్పిన లక్ష్మి.. ఇంత జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉంది అనే విషయం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ గొడవలు జరుగుతున్న సమయంలో మంచు లక్ష్మి మీడియా ముందుకు రాకపోయినా దీనిని ఉద్దేశించినట్టుగానే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది. ఈ గొడవలపై తాను ఈ పోస్ట్‌తో ఇన్‌డైరెక్ట్‌గా స్పందిస్తుందేమో అని అనుమానాలు కలుగుతున్న సమయంలోనే మంచు మనోజ్ భార్య భూమా మౌనిక.. దీనికి లైక్ కొట్టింది.
సోషల్ మీడియాలోనే స్పందన
తాజాగా మంచు లక్ష్మి తన కూతురు వీడియోను షేర్ చేస్తూ.. దానికి ‘పీస్’ అనే క్యాప్షన్‌ను జతచేసింది. ఈ సందర్భంలో తనకు పీస్ కావాలని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పకనే చెప్తోంది మంచు లక్ష్మి. ఇంతకంటే దీనిపై తాను స్పందించనని కూడా ఈ పోస్ట్‌తోనే చెప్పేస్తుందేమో అని నెటిజన్లు అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో ఈ పోస్ట్‌కు భూమా మౌనిక లైక్ కొట్టడం మరొక ఆసక్తికర విషయంగా మారింది. ఇంత గొడవ జరుగుతున్నప్పుడు మంచు లక్ష్మి ఆ పోస్ట్ ఏంటో.? దానికి మనోజ్ భార్య లైక్ కొట్టడమేంటో? అని మరికొందరు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి మనోజ్‌తో కలిసి తన భార్య భూమా మౌనిక కూడా మంచు ఫ్యామిలీపై సీరియస్‌గా ఉంది.
దగ్గరుండి పెళ్లి చేసింది
మంచు మనోజ్ (Manchu Manoj).. భూమా మౌనిక (Bhuma Mounika)ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి తన కుటుంబంలో తగాదాలు మొదలయ్యాయి. ఇరు కుటుంబాల సపోర్ట్ లేకపోవడంతో చాలాకాలం పాటు తమ ప్రేమను పెళ్లిగా మార్చకుండా ఆగిపోయింది ఈ జంట. కానీ మొత్తానికి మంచు ఫ్యామిలీ నుండి లక్ష్మి సపోర్ట్ అందడంతో మనోజ్, మౌనిక పెళ్లి పీటలెక్కారు. ఆ పెళ్లికి కూడా మంచు ఫ్యామిలీ నుండి ఎవ్వరూ రాలేదు. మంచు లక్ష్మి మాత్రమే పెళ్లి పెద్దగా మారి వీరి వివాహం జరిపించింది. ఎలాంటి సందర్భంలో అయినా మంచు మనోజ్‌కు తన సపోర్ట్ ఉంటుందని చెప్పిన లక్ష్మి.. ఇంత జరుగుతున్నా, తన తమ్ముడిని ఇంట్లోకి రానివ్వకుండా ఉన్నా కూడా బయటికి వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు.
నో కాంప్రమైజ్
మంచు ఫ్యామిలీలో జరుగుతుతున్న గొడవలపై మంచు లక్ష్మి (Manchu Lakshmi) స్పందన గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదట్లో మోహన్ బాబుకు కూడా ఈ విషయంపై ఓపెన్‌గా స్పందించడం ఇష్టం లేకపోయినా.. పరిస్థితి చేయి దాటిపోవడంతో అసలు వివాదాన్ని వివరిస్తూ ఒక వాయిస్ మెసేజ్‌ను విడుదల చేశారు. ఆ తర్వాత మంచు విష్ణు కూడా మీడియా ముందుకు వచ్చి ఈ విషయంపై వివరణ ఇచ్చారు. వీరి స్పందనలో అంతా కూల్‌గానే అనిపించినా.. మంచు మనోజ్‌తో కాంప్రమైజ్ అయ్యే విషయంలో మాత్రం మోహన్ బాబు (Mohan Babu), విష్ణు వెనక్కి తగ్గుతున్నారు