ssmb29 బడ్జెట్ 1000 కోట్లు..? రెండు పార్ట్లు..?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన వ్యక్తి ఎస్ఎస్ రాజమౌళి. శాంతి నివాసం అని సీరియల్ తో తన కెరీర్ స్టార్ట్ చేసిన ఎస్ఎస్ రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగులు వేశారు. ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. మొదటి సినిమాతోనే రాజమౌళి కూడా మంచి పేరును సాధించుకున్నాడు. ఆ తర్వాత చేసిన సింహాద్రి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మాస్ కమర్షియల్ సినిమాని ఎన్టీఆర్ లాంటి హీరోతో చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ కి ఆ సినిమాతో స్టార్డం వచ్చేలా చేశాడు. ఇక ఆ తర్వాత రాజమౌళి ఒక్కో సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరింత పైకి ఎదిగాడు. రాజమౌళి అయితే ఒక హీరో సినిమా చేశాడు అంటే ఆ హీరో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతాడు. రాజమౌళి స్థాయిలో ఆ హీరోని చూపించడానికి మిగతా దర్శకులు చాలా కష్టాలు పడుతుంటారు. అందుకే రాజమౌళితో పనిచేసిన హీరో ఇంకో దర్శకుడుతో సినిమా చేస్తే వెంటనే సక్సెస్ కొట్టలేడు.

 

రీసెంట్ గా ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాతో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయిందని కొంతమంది అనుకుంటారు. కానీ దానిని కూడా పూర్తిస్థాయిలో అందరూ ఏకీభవించరు. ఇక ప్రస్తుతం రాజమౌళి తన కెరియర్ లో మొదటిసారి స్టార్ హీరో తో సినిమాను చేస్తున్నాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మహేష్ బాబు కి ఎంత క్రేజ్ ఉంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గుణశేఖర్ ఒకడు సినిమాతో స్టార్ ఇమేజ్ సాధించుకున్నాడు మహేష్ బాబు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన పోకిరి మహేష్ ని నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామందికి స్టార్ హీరోస్ అనగానే గుర్తొచ్చేది ఒకటి పవన్ కళ్యాణ్ రెండు మహేష్ బాబు. మిగతా వాళ్లందర్నీ కేవలం హీరోలు గాని పరిగణిస్తారు.

 

ఇకపోతే ఇప్పటివరకు రాజమౌళి చాలామందిని స్టార్స్ ను చేశాడు. కానీ స్టార్ హీరోతో ఇప్పటివరకు పని చేయలేదు. ఆల్రెడీ స్టార్ ఇమేజ్ ఉన్న మహేష్ బాబుతో ప్రస్తుతం సినిమా చేస్తున్నాడు రాజమౌళి. అయితే ఈ సినిమా రెండు పార్ట్స్ లో ఉండబోతున్నట్లు సమాచారం వినిపిస్తోంది. రీసెంట్ టైమ్స్ లో ఈ పార్ట్స్ అనేవి ట్రెండ్ గా మారాయి ప్రతి హిట్ సినిమాకి మరో పార్ట్ సిద్దమవుతూ వస్తుంది. ఈ ట్రెండును కూడా స్టార్ట్ చేసింది రాజమౌళి. ఈ సినిమాకి దాదాపు 1000 కోట్ల వరకు బడ్జెట్ కేటాయిస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. కనీసం ఈ ప్రాజెక్టు పూర్తవడానికి 6 నుంచి 8 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అయితే దీనిపై చాలామంది పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు ఉన్న చాలా మంది మహేష్ బాబు ఫ్యాన్స్ అప్పటికి పెళ్లిళ్లు చేసుకుని తమ పిల్లలతో పాటు సినిమాను చూస్తారు అంటూ మీమ్స్ కూడా వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *