ఎన్ని ఇబ్బందులొచ్చినా ప్రజావాణి కొనసాగిస్తాం: భట్టి విక్రమార్క..

ప్రజావాణి కార్యక్రమాన్ని భవిష్యత్తులో మరింత మెరుగుపరుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఏడాది పూర్తయిన సందర్భంగా లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. వారి నుంచి పలు సూచనలు స్వీకరించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం 70 ఏళ్లు వెనక్కి పోయిందని.. భట్టి విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని…ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని భట్టి వివరించారు.

 

అధికారంలో వచ్చిన వెంటనే ప్రజావాణి ఏర్పాటు చేశామని.. నిరంతర పర్యవేక్షణతో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతుందని భట్టి అన్నారు. అదిలాబాద్‌లో పోడు భూముల పట్టాలకు పరిష్కారం తమ ప్రభుత్వం చూపిందన్నారు. అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి సోలార్ పవర్ ఇస్తాం అని భట్టి పేర్కొన్నారు. ప్రజల కోసం నిరంతరం తమ ప్రభుత్వం పని చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రజా వాణి మొదలై నేటికీ ఏడాది పూర్తయింది.

 

ఏడాది కాలంలో అనేక సమస్యలకు పరిష్కారం చూపిన ప్రజావాణి.. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో సమస్యలకు పరిష్కారం చూపింది. ఏ శాఖలో సమస్య ఉన్న ప్రజావాణి పరిష్కారం చూపుతుందన్నారు. ఆరోగ్య సమస్యలకు కూడా ప్రజావాణి ద్వారా సంబధిత హాస్పటల్‌కి పంపి చికిత్స చేసుకోవచ్చన్నారు. స్కాలర్షిప్ సమస్యలను ప్రజావాణి తీర్చిందని భట్టి తెలిపారు. గల్ఫ్ కార్మిక బాధితులకు ప్రజావాణి ద్వారా సహాయం అందిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *