మంచు ఫ్యామిలీలో ఏర్పడిన వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు మోహన్ బాబు తన మీద దాడి చేశాడని మంచు మనోజ్ మంచు మనోజ్ తన మీద దాడి చేశాడని మంచు మోహన్ బాబు ఇద్దరూ డయల్ హండ్రెడ్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తర్వాత మంచు ఫ్యామిలీ అది నిజంగాదని మీడియా కథనాలను ఖండించారు. అయితే ఈరోజు ఉదయం నుంచి మోహన్ బాబు జలపల్లి నివాసం వద్ద పెద్ద ఎత్తున బౌన్సర్లను మొహరించడం హాట్ టాపిక్ అవుతోంది. మంచు విష్ణు తరుపున 40 మంది మంచు మనోజ్ తరఫున 30 మంది బౌన్సర్లు ఆ నివాసం దగ్గర మోహరించారు. కొంతమంది లేడీ బౌన్సర్లు సైతం రంగంలోకి దిగడంతో అసలు ఏం జరుగుతుందా అని అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
అయితే కాసేపట్లో మోహన్ బాబు మంచు మనోజ్ ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటారని దుబాయ్ నుంచి వచ్చిన మనసు విష్ణు కూడా వీరితోపాటు కలిసి మాట్లాడే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఒకరకంగా ఫ్యామిలీలో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించే దిశగా అడుగులు పడుతున్నట్లు ప్రచారం జరుగుతూ ఉండగా అది నిజం కాదని మళ్ళీ తేలింది. ఇప్పుడు ఫైనల్ గా జల్ పల్లి మోహన్ బాబు నివాసం నుంచి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి మంచు మనోజ్ బయలుదేరి వెళ్ళాడని తెలుస్తోందది.. పోలీస్ స్టేషన్ లో మోహన్ బాబు ప్రమేయంతో తనపై జరిగిన దాడి పై ఫిర్యాదు చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది.