ఢిల్లీ ఎన్నికలకు ఆప్ రెండో జాబితా విడుదల..!

వచ్చే ఏడాది జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార ఆమ్ ఆద్మీ పార్టీ వేగంగా సన్నాహాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్ధుల తొలి జాబితా విడుదల చేసిన ఆప్.. ఇవాళ రెండో జాబితా కూడా విడుదల చేసింది. ఇందులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా పలువురికి చోటు దక్కింది. ఇవాళ ప్రకటించిన రెండో జాబితాలో మొత్తం 20 మంది అభ్యర్ధులకు చోటు దక్కింది.

 

ఇవాళ ఆప్ ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో నరేలా నుంచి దినేష్ భరద్వాజ్, తిమర్పూర్ నుంచి సురేందర్ పాల్ సింగ్ బిట్టూ, ఆదర్శ్ నగర్ నుంచి ముకేష్ గోయల్, ముండ్కా నుంచి జస్బీర్ కరాలా, మంగోల్పురి నుంచి రాకేష్ జాతవ్ ధర్మ రక్షక్, రోహిణి నుంచి ప్రదీప్ మిట్టల్, చాందినీ చౌక్ నుంచి పునర్దీప్ సింగ్ సాహ్నీ, పటేల్ నగర్ నుంచి పర్వేష్ రతన్, మాదీపూర్ నుంచి రాఖీ బిద్లన్, జనక్ పురి నుంచి ప్రవీణ్ కుమార్, బిజ్వాసన్ నుంచి సురేందర్ భరద్వాజ్, పాలం నుంచి జోగిందర్ సోలంకికి చోటు దక్కింది.

 

అలాగే జాంగ్ పుర నుంచి మనీష్ సిసోదియాకు, దియోలీ నుంచి ప్రేమ్ కుమార్ చౌహాన్, త్రిలోక్ పురి నుంచి అంజనా పర్చా, పత్పర్ గంజ్ నుంచి అవథ్ ఓఝా, కృష్ణానగర్ నుంచి వికాస్ బగ్గా, గాంధీ నగర్ నుంచి నవీన్ చౌదరి, షాదరా నుంచి పద్మశ్రీ జితేంద్ర సింగ్ కు, ముస్తఫా బాద్ నుంచి ఆదిల్ ఆహ్మద్ ఖాన్ కు చోటు దక్కింది. గతంలో ప్రకటించిన 11 మందితో కలుపుకుని ఇప్పటివరకూ 31 మంది అభ్యర్ధుల్ని ఆప్ ప్రకటించినట్లయింది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 సీట్లు ఉన్నాయి. ఈసారి కూడా ఆప్ ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *