తెలంగాణకు మళ్లీ పెట్టుబడుల రాక.. ఉపాధికి ఇక ఢోకా ఉండదు.. మంత్రి శ్రీధర్ బాబు..

రాష్ట్రంలోకి మరో భారీ పెట్టుబడి వచ్చింది. మల్టీ నేషనల్ ఐవేర్ కంపెనీ ‘లెన్స్‌కార్ట్’ హైదరాబాద్‌లో రూ.1500 కోట్లతో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలోనే అతిపెద్ద ఐవేర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను స్థాపించేందుకు ముందుకొచ్చింది. ఈ యూనిట్‌లో సన్ గ్లాసెస్, కూలింగ్ గ్లాసెస్‌ను తయారు చేయనుంది. ఈ యూనిట్ ద్వారా మొత్తం 1600 మందికి ఉపాధి దక్కునుంది. వచ్చే నెల నుంచి పనులను ప్రారంభించనున్నట్టు లెన్స్ కార్ట్ కంపెనీ తెలిపింది.

 

మంత్రి సమక్షంలో ఆరు ఒప్పందాలు

కాగా లెన్స్‌కార్ట్‌తో కలిపి ఆరు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ మేరకు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ప్రభుత్వంతో ఆరు కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. ఏరో ఈ జాబితాలో స్పేస్ డిఫెన్స్ పాటు పలు కంపెనీలు ఉన్నాయి. ఎంవోయూలు కుదుర్చుకున్న వెంటనే ఆయా కంపెనీలు పనులు ప్రారంభించనున్నాయి. రెండు మూడు నెలల్లోనే పనులు మొదలుకానున్నాయి. దీంతో వందలాది మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. పలు సంస్థలు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. సివిల్ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు కూడా శిక్షణ ఇచ్చేందుకు సంస్థల ఆసక్తి చూపుతున్నాయి. ఈ ఎంవోయూలతో రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన లక్షలాది మంది విద్యార్థులు, యువతను సిద్ధం చేయవచ్చు.

 

మీ సేవలో మరిన్ని సేవలు

ఆదివారం నుంచి ‘మీ సేవ’లో మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక ‘మీ సేవ’ల కోసం కొత్త మొబైల్ యాప్‌ని మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా 250లకు పైగా సర్వీసులు లభ్యం కానున్నాయి. ఈ యాప్‌లో సీనియర్ సిటిజన్స్‌కు ప్రత్యేక సేవలు అందుబాటులోకి వచ్చాయి. వృద్ధులు ‘మీ సేవ’ యాప్ ద్వారా కాల్ సెంటర్‌కి ఫోన్ చేసి సేవల పొందే అవకాశం ఉంటుంది. దీంతో మీ సేవ సెంటర్‌కు వెళ్లకుండానే ప్రత్యేక ఆప్షన్ల ద్వారా సేవలు పొందవచ్చు. ఇక ‘మీ సేవ’ పొందేందుకు వీలుగా కియోస్క్ మెషీన్స్ కూడా ఏర్పాటు కానున్నాయి. ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్, బస్టాండ్, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటేరియెట్ వంటి పలు ప్రాంతాల్లో కియోస్క్ మిషన్లు ఏర్పాటు చేయనున్నారు. కియోస్క్ మిషన్ల ద్వారా మీ సేవలో ప్రభుత్వ అందించే అన్ని సేవల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *