శీతాకాల అసెంబ్లీ సమావేశాలను అడ్డుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది బీఆర్ఎస్. సమావేశాలతోపాటు తెలుగు తల్లి విగ్రహం విషయంలో దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్లు చేసింది.. సక్సెస్ అయ్యారు కారు పార్టీ.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాకుండానే టెన్షన్ నెలకొంది. సోమవారం ఉదయం పార్టీ ఆఫీసు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేరుగా అసెంబ్లీకి వచ్చారు. అదానీ-సీఎం రేవంత్ ఫోటోతో ఉన్న టీ షర్టులు ధరించి వచ్చారు. గేటు వద్ద వారిని అడ్డుకున్నారు పోలీసులు. ఇలాంటి సంప్రదాయం మంచిది కాదని సభ్యులకు నచ్చజెప్పారు.
టీ షర్టులు తొలగించి లోపలికి వెళ్లాలని సూచించారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. అసెంబ్లీ లోపలికి పంపకపోవడంతో అసెంబ్లీ గేటు బయట నేతలు ఆందోళనకు దిగారు. నేతలు ఎంతకీ బెట్టు దిగకపోవడంతో ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు పోలీసులు.