మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం కొండాపూర్‌లోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసానికి హరీశ్‌రావు వచ్చారు. గేటు వద్ద ఆయనను పోలీసులు ఆపి వేశారు. లోపలికి వెళ్లడానికి అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులకు- పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి హరీశ్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్టు వెనుక కారణమేంటి? విధులకు ఆటంకం కలిగించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బంజరాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్టేషన్‌లో సీఐపై దుర్భాషలాడిన కౌశిక్ రెడ్డి, అధికారి విధులకు ఆటంకం కలిగించి, బెదిరింపులకు పాల్పడ్డారన్నది ప్రధాన కారణం. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదిలావుండగా గురువారం ఉదయం కొండాపూర్‌లోని పాడి కౌశిక్‌రెడ్డికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి పీఎస్ కు తరలించారు. పాడి కౌశిక్ అరెస్ట్ విషయం తెలియగానే మాజీ మంత్రులు హరీష్‌రావుతోపాటు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.
ఎమ్మెల్యే ఇంట్లోకి హరీష్ రావు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఒక్కసారి వెనక్కి వెళ్తే.. ఏ విషయంలోనైనా ఎమ్మెల్యే పాడి కౌశక్‌రెడ్డికి మొదటి నుంచి హరీష్‌రావు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లారని అంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు.
ఇదిలావుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయ్యింది. రాజకీయ కక్షతో ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టు తలుపు తట్టారు హరీష్‌రావు. దీనికి సంబంధించి పోలీసులు ప్రాథమిక విచారణ జరపకుండానే కేసు నమోదు చేశారని అందులో ప్రస్తావించారు.
ఫిర్యాదు ఆధారంగా తనను అరెస్ట్ చేస్తే పొలిటికల్ కెరీర్, ప్రతిష్ట దెబ్బతింటుందని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎప్పుడో జరిగిన ఘటన అని అన్నారు. సిద్ధిపేట నుంచి వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తనపై నమోదైన కేసు కొట్టివేయాలని ప్రస్తావించారు.
అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్‌పైనా ఇదే న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసి ఆ తర్వాత చక్రధర్ గౌడ్ ఉపసంహరించుకున్నారని వివరించారు. కావున తనపై నమోదైన కేసు, దర్యాప్తు ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశాయని కోరారు. ఈ పిటిషన్ గురువారం హైకోర్టు ముందుకు విచారణ రానుంది.