బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపులపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. పార్టీ కార్యాలయాలకు చౌకగా భూములు ఇచ్చారంటూ దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది.
హైదరాబాద్‌తోపాటు మిగతా జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం చౌకగా భూములు అమ్మకాలు దక్కించుకున్నారని పిటిషనర్ ప్రస్తావించారు. 500 కోట్లు విలువైన భూమిని కేవలం 5 కోట్లుకు కేటాయించారని వాదించారు.
గజం 100 రూపాయలకే కేటాయింపు జరిగినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అధికారులు, జర్నలిస్టులకు భూ కేటాయింపులపై గత నెల 25న ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
రెండేళ్లగా ఈ అంశంపై ప్రతివాది మాజీ సీఎం కేసీఆర్ కౌంటర్ దాఖలు చేయలేదని పేర్కొన్నారు. దీనిపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని మాజీ సీఎం కేసీఆర్‌తోపాటు ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.