రాష్ట్రంలో నియంత పాలనకు చరమ గీతం పాడి ఏడాది అయ్యింది. ప్రజా పాలన ఏర్పాటుకు సంపూర్ణంగా సహకరించిన తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్.
గడీల పాలన, ఫామ్ హౌస్ పాలనతో విసిగిపోయింది తెలంగాణ. అవినీతి, కుటుంబ పాలనకు స్వస్తి పలికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటైంది. సంపూర్ణ మెజారిటీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మద్దతు ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు.
ఏడాది పాలనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మిగతా మంత్రుల సమిష్టి నిర్ణయాలతో తొలి ఏడాది అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో వెలిగిపోతోందన్నారు. ప్రస్తుతం రైజింగ్ తెలంగాణగా ఉందన్న విషయం ప్రజలకు అందరికి తెలుసన్నారు.
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేనంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు టీపీసీసీ. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత సదుపాయం, ఆరోగ్య శ్రీ 10 లక్షల పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చి మాట నిలబెట్టుకున్నామని తెలిపారు.
రైతులకు రెండు లక్షల రుణమాఫీ కోసం 21 వేల కోట్ల రూపాయల కేటాయించిందన్నారు. దీని ద్వారా 23 లక్షల మందికి లబ్ది జరిగిందన్ని విషయాన్ని వక్కానించారు మహేష్‌కుమార్. ధాన్యం 500 రూపాయల బోనస్‌తో రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు.
ఒక్క ఏడాదిలో సుమారు 54 వేల 500 ఉద్యోగాలు ఇచ్చి యువతను అదుకుందని, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ లు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. డ్రగ్స్ నివారణకు కృషి జరుగుతోందని వివరించారు.
ఇక మూసీ నది పునర్జీవనం ఒక అద్భుతమైన పథకంగా వర్ణించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఓ వైపు పథకాలు.. మరోవైపు అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ఏడాదిలో అన్ని రకాలుగా సహకరించిన ప్రజలకు తన వంతు ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్