ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘రాజా సాబ్’ టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..!

పాన్ ఇండియా స్టార్ అనే ట్యాగ్ వచ్చిందంటే హీరోలు వెంటవెంటనే సినిమాలు చేయడం కష్టమే. పాన్ ఇండియా స్టార్ అంటే దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నవారే అయ్యింటారు. అందుకే దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు వారి మూవీ రీచ్ అవ్వాలంటే భారీ బడ్జెట్ కావాలి, ఔట్‌పుట్ బాగుండాలి.. ఇలా ఎన్నో అంశాల వల్ల సినిమాలు లేట్ అవుతూ ఉంటాయి. అలాగే ‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్టార్ అనే ట్యాగ్ సంపాదించుకున్న ప్రభాస్ కూడా ఆ తర్వాత సినిమాల విషయంలో లేట్ చేశాడు. కానీ ఇప్పుడు కనీసం ఏడాదికి ఒక సినిమాతో ఫ్యాన్స్‌ను అలరించాలని అనుకుంటున్నాడు. లైన్‌లో ‘ది రాజా సాబ్’ (The Raja Saab) రెడీగా ఉంది.

 

టీజర్ కోసం

 

మారుతీ (Maruthi) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) సినిమా అనగానే ఈ కాంబినేషన్‌పై చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అసలు మారుతీ.. ప్రభాస్ స్టార్‌డమ్‌ను హ్యాండిల్ చేయగలడా, తనతో సినిమా తెరకెక్కించి ఫ్యాన్స్‌ను హ్యాపీ చేయగలడా.. ఇలా చాలా సందేహాలు వినిపించాయి. కానీ వాటన్నింటికి ఒక్క పోస్టర్‌తో సమాధానమిచ్చాడు ఈ దర్శకుడు. ‘ది రాజా సాబ్’ నుండి ముందుగా ఒక మాస్ పోస్టర్‌ను విడుదల చేసి ప్రభాస్ ఫ్యాన్స్‌ను హ్యాపీ చేశారు మేకర్స్. ఆ తర్వాత ఒక గ్లింప్స్ విడుదలయ్యింది. అందులో ప్రభాస్ కూల్ లుక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ముసలివాడి పాత్రలో ఈ హీరో కనిపించడం అయితే అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇప్పుడు ఈ మూవీ నుండి టీజర్ రిలీజ్‌కు టైమ్ వచ్చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.

 

బ్యాక్ టు బ్యాక్

 

‘ది రాజా సాబ్’ మూవీ 2025 ఏప్రిల్ 10న విడుదలను ఫిక్స్ చేసుకుంది. మూవీ రిలీజ్‌కు ఇంకా చాలా టైమ్ ఉన్నా కూడా అప్పుడప్పుడు అప్డేట్స్ ఇవ్వడం వల్ల ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతారని మేకర్స్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకే క్రిస్మస్ సందర్భంగా ‘రాజా సాబ్’ టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. గ్లింప్స్, టీజర్.. ఇలా ఎన్ని వచ్చినా కూడా ఒక సాంగ్ రిలీజ్ అయితే ఫ్యాన్స్ మరింత హ్యాపీగా ఫీలవుతారు. అందుకే అతి త్వరలో ఒక మాస్ పాటను విడుదల చేయాలని మూవీ టీమ్ నిర్ణయించుకుందని సమాచారం. మొత్తానికి టీజర్, సాంగ్.. ఇలా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్‌తో మేకర్స్ సిద్ధంగా ఉన్నారట.

 

సంక్రాంతికి రావాల్సింది

 

అసలైతే 2025 సంక్రాంతికే ‘ది రాజా సాబ్’ మూవీ విడుదల కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల అది సమ్మర్‌కు పోస్ట్‌పోన్ అయ్యింది. అందుకే సమ్మర్‌కు ప్రభాస్ ఫ్యాన్స్‌ను హ్యాపీ చేయడం కోసం ఈ మూవీ నుండి మాస్ పాటను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ‘రాజా సాబ్’ విడుదలకు ఇంకా సమయం ఉన్నా కూడా ఇప్పుడే తరచుగా అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయాలని ప్లానింగ్‌లో ఉన్నారు మేకర్స్. ప్రభాస్ కెరీర్‌లో మొట్టమొదటి హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ ఎలా ఉంటుందా అని మూవీ లవర్స్‌లో ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *