కొడాలి నానికి ఉచ్చు బిగుసుకుంటుందా..? మరోసారి..

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడిన వారి పైన వరుస కేసులు నమోదు అవుతున్నాయి. విచారణ కొనసాగుతోంది. పలువురు ముఖ్య నేతల పైన గురి పెట్టారు. సోషల్ మీడియా కేసుల తరువాత ఈ నేతల అరెస్ట్ ల పైన పోలీసులు ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. గుడివాడలో వరుస ఫిర్యాదులతో మాజీ మంత్రి కొడాలి నానికి ఉచ్చు బిగుస్తోంది. అదే సమయంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

 

కొడాలి నాని ఎక్కడ

మాజీ మంత్రి కొడాలి నాని పై వరుస కేసులు నమోదవుతున్నాయి. వైసీపీ హయాంలో టీడీపీ నేతల ను లక్ష్యంగా చేసుకొని కొడాలి నాని తరచూ తీవ్ర వ్యాఖ్యలు చేసేవారు. దీంతో, కూటమి అధికారం లోకి వచ్చిన తరువాత కొడాలి నానిని పైన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు చేసారు. టీడీపీ కేడర్ నుంచి కొడాలి నాని అరెస్ట్ కోసం ఒత్తిడి పెరుగుతోంది. ఇదే సమయంలో గుడివాడలో జగనన్న కాలనీల్లో అక్రమాలు జరిగాయంటూ తాజాగా మరో కేసు నమెదు అయింది. ఈ కేసులో విచారణ వేగవంతం అయింది.

 

వరుస ఫిర్యాదులతో

గుడివాడలో జగనన్న కాలనీల కోసం 173 ఎకరాల భూమి సేకరించారు. మెరక పేరుతో అనుచ రులకు వర్క్ ఆర్డర్స్‌ ఇచ్చారని నాని మీద ఆరోపణలు ఉన్నాయి. అలా తనకు కావాల్సిన వాళ్లకు పనులు అప్పగించి 8కోట్ల రూపాయలతో పనులు చేపట్టి.. 40 కోట్ల దాకా స్వాహా చేసినట్లుగా కొడాలి నాని పైన ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటికే ఈ వ్యవహారం పైన విజిలెన్స్ విచారణ చేసింది. ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. జగనన్న కాలనీల కోసం గుడివాడ నియోజకవర్గం మల్లాయ పాలెంలో 178.3 ఎకరాలు సేకరించారు. ఎకరా రూ.52 లక్షలు పెట్టి కొన్నారని తెలుస్తోంది. అక్కడ చదును చేయటం కోసం మెరక వర్క్‌ ఆర్డర్లు పొందిన వారంతా కొడాలి నాని అనుచరు లనే ఫిర్యాదులు ఉన్నాయి.

 

నాని మెడకు ఉచ్చు

నాని బినామీలే పనులు చేయించారనే ఆరోపణలతో విచారణ కొనసాగు తోంది. ఈ నివేదిక ఆధా రంగా కొడాలి నాని పైన చర్యలకు దిగే అవకాశం ఉంది. టీడీపీ పైన వైసీపీ హాయంలో విరుచుకు పడిన కొడాలి నాని..వల్లభనేని వంశీ ఇద్దరూ మౌనంగా ఉంటున్నారు. ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయటం లేదు. పార్టీ వ్యవహారాల్లోనూ పాల్గొనటం లేదు. కేసులు వెంటాడుతున్న సమయంలోనే ఇద్దరు నేతలు సైలెంట్ అయ్యారనే అభిప్రాయం ఉంది. అయితే, పూర్తి ఆధారాలతోనే కొడాలి నాని విషయంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వంలోని ముఖ్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో, నాని విషయంలో రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేది ఉత్కంఠగా మారుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *