మోక్షజ్ఞ కొత్త లుక్ వైరల్..!

తేజేశ్విని నందమూరి సమర్పకురాలిగా సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్ & లెజెండ్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంత్ వర్మతో మోస్ట్ అవెయిటెడ్ లాంచ్‌ప్యాడ్ ఫిల్మ్ ప్రీ-ప్రొడక్షన్ సమయంలో నందమూరి మోక్షజ్ఞ న్యూ లుక్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు మనవడు మరియు నటుడు, రాజకీయవేత్త నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ, ఇటీవలి హనుమాన్‌ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాకు దర్శకత్వం వహించిన క్రియేటివ్ జెమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించే క్రేజీ ప్రాజెక్ట్‌తో గ్రాండ్‌గా అరంగేట్రం చేయబోతున్నాడు. మోక్షజ్ఞ తొలి చిత్రం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగం అవుతుంది.

 

మోక్షజ్ఞ నటన, ఫైట్లు మరియు డ్యాన్స్‌లలో ప్రముఖలు వైజాగ్ సత్యానంద్ వద్ద శిక్షణ పొందాడు. మోడరన్, స్టైలిష్ లుక్‌లో అద్దంలోకి చూస్తున్న మోక్షజ్ఞ కొత్త స్టిల్ విడుదలైంది. గళ్ల చొక్కా ధరించి, పొడవాటి, పర్ఫెక్ట్ స్టైల్ చేసిన జుట్టు మరియు గడ్డంతో చిన్న సింహం మాదిరి ఉన్నాడు అని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలను డిసెంబరు 5న నిర్వహిచనున్నారు. సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌తో నిర్మించనున్నారు. మోక్షజ్ఞ పుట్టినరోజున రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. భారతీయ పురాతన పౌరాణిక ఇతిహాసం నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది.ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *