ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాపై క్రేజీ అప్డేట్…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) రీసెంట్ గా ‘దేవర’ (Devara) మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం వహించిన ఈ మూవీతో ఎన్టీఆర్ సోలోగానే బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టారు. జాన్వి కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించిన ఈ సినిమాతో రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేశారు ఎన్టీఆర్. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ (NTRNeel Movie) కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆయన అభిమానులు. తాజాగా ఈ మూవీ గురించి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.

 

ప్రస్తుతం ఎన్టీఆర్ “వార్ 2” (War 2) మూవీ షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నారు. ‘దేవర’ తర్వాత ఎలాంటి గ్యాప్ లేకుండా ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. ఇక త్వరలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయాల్సిన మూవీ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రస్తుతం ‘వార్ 2’ మూవీ షూటింగ్ ముంబైలో కొనసాగుతుండగా, జనవరి వరకు ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని అంటున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని, డిసెంబర్ లో హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో సినిమా సెట్ లోకి ఎన్టీఆర్ అడుగు పెట్టబోతున్నారని టాక్ నడుస్తోంది.

 

ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ (NTRNeel Movie) సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ సంక్రాంతి కానుకగా 2025 జనవరిలో రాబోతోందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ ని అనుకుంటున్నారని టాక్ నడుస్తోంది. మరి మేకర్స్ ప్రచారం జరుగుతున్నట్టుగా ఇదే టైటిల్ ను ఫిక్స్ చేశారా? లేదంటే మరేదైనా కొత్త టైటిల్ ని పెట్టబోతున్నారా ? అనే విషయం తెలియాలంటే టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

 

కాగా ఈ మూవీకి ‘కేజిఎఫ్’ టెక్నికల్ టీం వర్క్ చేయబోతోంది. అలాగే ఈ సినిమాలో విలన్ గా నటించడానికి ఓ క్రేజీ హీరోను ప్రశాంత్ నీల్ సంప్రదించారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ను నిర్మిస్తున్నారు. ఈ మూవీ 2026 జనవరిలో రిలీజ్ కానుందని ఇప్పటికే అనౌన్స్ కూడా చేశారు. ఇక ‘దేవర’ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న ఎన్టీఆర్… ఇటు ‘వార్ 2’ షూటింగ్ పూర్తి కాగానే, అటు ప్రశాంత్ నీల్ తో మూవీని షురూ చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *