అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీల ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో సమానంగా ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సొసైటీలు, యూనివర్సిటీ ఉద్యోగులకు మధ్యంతర భృతి – ఐఆర్ (ఇంటీరిమ్ రిలీఫ్) ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం. దీంతో.. అన్ని వర్గాల ప్రభుత్వ ఉద్యోగులకు మంచి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉద్యోగులకు అందుతున్న మూల వేతనం పై 5 శాతం మధ్యంతర భృతి మంజూరు చేస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.