పుష్ప రాజ్‌కు షాక్ ఇచ్చిన సెన్సార్..? ఆ సీన్స్ కట్..?

ప్రస్తుతం సినీ సర్కిల్లో ఎక్కడ చూసినా ‘పుష్ప 2’ గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా చాలామంది ప్రేక్షకులు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. పైగా మూవీ టీమ్ కూడా ‘పుష్ప 2’ను ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం కోసం దేశమంతా చుట్టేస్తూ ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ విషయం పక్కన పెడితే ‘పుష్ప 2’ సెన్సార్ రిపోర్ట్ తాజాగా బయటికొచ్చింది. అందులో ఉన్న కట్స్ చూసి అల్లు అర్జున్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయినట్టు అనిపిస్తోంది. ఆ కట్స్ వల్ల కిక్ పోతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

సెన్సార్ కట్స్

 

అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో మూడేళ్ల క్రితం ‘పుష్ప’ అనే మూవీ విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలవ్వగానే మిక్స్‌డ్ టాక్ అందుకుంది. కొందరు ప్రేక్షకులు అయితే సినిమా అస్సలు బాలేదని కూడా అన్నారు. కానీ కట్ చేస్తే.. కొన్నిరోజుల్లోనే ఈ మూవీ రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధించింది. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ మ్యానరిజం, సినిమా పాటలు తెగ వైరల్ అయ్యాయి. అప్పటినుండి ఈ మూవీ సీక్వెల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తూనే ఉన్నారు. మూడేళ్ల తర్వాత ‘పుష్ప 2’ విడుదలకు సిద్ధం కాగా ప్రేక్షకులను కిక్ ఇచ్చే కొన్ని సీన్స్, డైలాగ్స్‌ను సెన్సార్ కట్ చేసింది.

 

బూతులు లేవు

 

‘పుష్ప 2’లో సెన్సార్ చేసిన కట్స్ విషయానికొస్తే.. రం*డి అనే పదాన్ని లపాకిగా మార్చమని సెన్సార్ బోర్డ్ ఆదేశించింది. వెంకటేశ్వర అని దేవుడి పేరును భగవంతుడిగా మార్చమని చెప్పింది. దెం*గు*ద్ది అనే బూతు పదాన్ని మ్యూట్ చేయమని సెన్సార్ బోర్డ్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ‘పుష్ప 2’ సినిమాలో వైలెన్స్ కూడా చాలానే ఉంది. ఆ వైలెన్స్ విషయంలో కూడా సెన్సార్ కట్స్ చేసింది. లెగ్ కట్, హ్యాండ్ కట్స్ లాంటి సీన్స్‌ను రిమూవ్ చేయమని, బ్లర్ చేయమని సెన్సార్ ఆదేశించింది. మొత్తానికి ఈ కట్స్‌తో ‘పుష్ప 2’ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతుండగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.

 

రన్ టైమ్‌పై చర్చ

 

‘పుష్ఫ 2’ (Pushpa 2) విషయంలో చాలామంది ప్రేక్షకుల చర్చించుకుంటున్న మరొక అంశం రన్ టైమ్. ఒకప్పుడు రెండున్నర గంటల సినిమాను ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కించడానికి మేకర్స్ కష్టపడేవారు. అలాంటిది ఈమధ్య కాలంలో విడుదలయిన ‘యానిమల్’ సినిమా మూడున్నర గంటలు ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసింది. అదే ధైర్యంతో ‘పుష్ప 2’ను 3 గంటల 20 నిమిషాల 38 సెకండ్ల రన్ టైమ్‌తో రంగంలోకి దించుతున్నాడు సుకుమార్. ఇప్పటికే మూడేళ్ల పాటు ఈ సీక్వెల్ కోసం ఎదురుచూసేలా చేశారని ‘పుష్ప 2’పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇదే సమయంలో ఇంత రన్ టైమ్ మూవీకి ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *