గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ కన్ఫర్మ్..? ఎవరంటే..?

తెలుగు నుండి ఎంతోకాలం క్రితం విడుదల అవ్వాల్సిన పాన్ ఇండియా సినిమాలు పోస్ట్‌పోన్ అవుతూ ఇన్నాళ్లకు రిలీజ్ డేట్స్‌ను ఫిక్స్ చేసుకున్నాయి. ఈ పాన్ ఇండియా చిత్రాల్లో రెండు మెగా హీరోలవే అవ్వడం విశేషం. ముందుగా డిసెంబర్‌లో ‘పుష్ప 2’ విడుదల అవ్వగానే సంక్రాంతి రేసులోకి ‘గేమ్ ఛేంజర్’ దూసుకురానుంది. ఇక ఈ ‘గేమ్ ఛేంజర్’ను ప్రమోట్ చేయడం కోసం మేకర్స్ పక్కా ప్లాన్‌ను సిద్ధం చేశారు. ముందుగా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని చెప్పి అనౌన్స్ చేశారు. ఇక అమెరికాలోనే ఆ రేంజ్‌లో ఈవెంట్ ప్లాన్ చేస్తే.. మరి తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఈవెంట్ మరో లెవెల్‌లో ఉండాల్సిందే కదా..

 

మ్యూజికల్ ప్రమోషన్స్

 

శంకర్ (Shankar), రామ్ చరణ్ (Ram Charan) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా ప్రారంభం అయినప్పటి నుండే ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అసలు ఈ మూవీ విడుదల అవుతుందా లేదా అని చాలామంది ఫ్యాన్స్ అనుమానించారు. మొత్తానికి సంక్రాంతికి ఈ సినిమా విడుదల అని తెలియగానే మెగా ఫ్యాన్స్ అంతా ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారు. ఇంకా మూవీ రిలీజ్‌కు నెలకు పైగా ఉందని ప్రమోషన్స్‌ను స్లోగా మొదలుపెట్టే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. మొత్తానికి ‘గేమ్ ఛేంజర్’ మ్యూజికల్ ప్రమోషన్స్ మాత్రం ఇప్పటికే మొదలయ్యాయి. ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా మూడో పాటకు సంబంధించిన రీహార్సెల్ వీడియో కూడా బయటికొచ్చింది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఆసక్తికర అప్డేట్ రివీల్ అయ్యింది.

 

అందుకే అక్కడ

 

రాజమండ్రిలో ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరగనుంది. అంతే కాకుండా ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హాజరు కానున్నట్టు సమాచారం. డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఒక్క సినిమా ఈవెంట్‌కు కూడా హాజరు కాలేదు. మొత్తానికి అబ్బాయి రామ్ చరణ్ కోసం బాబాయ్ పవన్ కళ్యాణ్ మొదటిసారి రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ స్పెషల్‌గా హాజరు కావడం కోసమే ఈ ఈవెంట్‌ను రాజమండ్రిలో ఏర్పాటు చేసుంటారు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. జనవరి 4న రాజమండ్రిలో ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముహూర్తం ఖరారు అయ్యింది.

 

చాలాకాలం తర్వాత

 

మెగా హీరోలను ఒకే స్టేజ్‌పై చూడడానికి ఫ్యాన్స్ ఎప్పుడూ ఎదురుచూస్తూనే ఉంటారు. కానీ వాళ్లంతా ఎప్పుడూ తమ షెడ్యూల్స్‌తో బిజీగా ఉండడంతో వారిని ఒకే స్టేజ్‌పై చూడడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అలాగే ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌లో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్‌ను ఒకే స్టేజ్‌పై చూడడం కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్‌గా ఫీలవుతున్నారు. ‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తుండగా.. సునీల్, శ్రీకాంత్ లాంటివారు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *