సౌరశక్తి విద్యుత్ సరఫరా ఒప్పందాలు పొందడాని గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ సహా ఆరుగురు నిందితులు భారత ప్రభత్వ అధికారులకు లంచాలు ఇచ్చారని యూఎస్ ప్రాసిక్యూటర్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వారికి అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు. ఇక ఈ కేసులో ఏపీ మాజీ సీఎం జగన్ కూడా ఆరోపణలు ఎదురుకుంటున్నారు. తమ నుండి విద్యుత్ కొనుగోలు చేయాలని SECI జూన్ 2020లో రాష్ట్రాలతో అగ్రిమెంట్ చేసుకుంది. అయితే 18 నెలలు దాటినా, ఏ ఒక్క రాష్ట్రం కూడా విద్యుత్ కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. అంత ఎక్కువ ధరకు విద్యుత్ కొనలేం, మాకు మీ కరెంటు వద్దు అని తేల్చి చెప్పేశాయి.
కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే, ముందుకు వచ్చి విద్యుత్ కొనుగోలు చేసింది. అన్ని రాష్ట్రాలు వద్దు అంటుంటే, మాజీ సీఎం జగన్ మాత్రం మాకు కావాలి అంటూ ఎక్కువ ధరకు విద్యుత్ కొనడానికి ఒప్పుకున్నారు. ఈ నిజాలను అమెరికా కోర్టు బయట పెట్టింది. ఆగస్టు 2021లో అర్ధరాత్రి హడావిడిగా విద్యుత్ కొనుగోలు ఫైల్ ను పరిగెత్తించారని పేర్కొంది. అధికారులు, మంత్రులు ఆఘమేఘాల మీద అర్ధరాత్రి పరుగులు తీశారని తెలిపింది. ఇండియాలోనే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అవినీతి పరుడని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ ఏజెన్సీ సంచలన ఆరోపణలు చేసింది.
మాజీ సీఎం ఏకంగా రూ.1750 కోట్ల లంచాలు డైరెక్ట్ గా తీసుకున్నారని, తమ వద్ద ఆధారాలు సైతం ఉన్నాయని ఎఫ్బీఐ చెబుతోంది. ఇదిలా ఉంటే ఇండియాలో కోర్టుల్లో కేసులు రుజువు అయ్యేందుకు కొంత సమయం పడుతుందని తెలిసిందే. కొన్ని నేరాల్లో తీర్పులు ఇచ్చేందుకు ఏళ్లు పడుతుంది. అయితే అమెరికా కోర్టుల్లో మాత్రం ఏడాదిలోపే కేసును తేల్చేస్తాయట. కాబట్టి నేరం రుజువైతే అదానీ ఇతర నిందితులతో పాటూ మాజీ సీఎం జగన్ కూడా జైలుకు వెళ్లక తప్పదు. అంతేకాకుండా మనదేశంలో జైలుకు వెళ్లినా ఇంటిభోజనం తీసుకునేందుకు కొంతమందికి అనుమతిస్తుంటారు. కానీ అమెరికా జైళ్లలో మాత్రం బ్రెడ్డు జాం తప్ప ఇంటి నుండి ఆహారం తీసుకునేందుకు అనుమతి ఇవ్వరట. ప్రస్తుతం ఇదే విషషం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.