అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్.. అమ్మాయి ఎవరో తెలుసా..?

అక్కినేని అఖిల్ ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు.. అక్కినేని నాగార్జున వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అడపా దడపా సినిమాలు చేసాడు. కానీ ఒక్క బ్లాక్ బాస్టర్ సినిమా కూడా తన ఖాతాలో పడలేదు. ఈ మధ్య ఏజెంట్ సినిమాతో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినిమాల విషయం పక్కన పెడితే అఖిల్ ఎంగేజ్మెంట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాగ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇప్పుడు అఖిల్ జీవితంలోకి రాబోతున్న అమ్మాయి పేరు జైనాబ్ రావ్‌జీ.. ఆమె దుబాయికి సంబందించిన ఒక మోడల్ .. ఎదో సందర్బంలో వీరిద్దరూ కలిశారు. పెద్దలు అంగీకారంతోనే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే టాక్ వినిపిస్తుంది. ఇక తాజాగా అఖిల్ ఎంగేజ్మెంట్ త్వరలో అని నాగార్జున సోషల్ మీడియాలో ద్వారా తెలిపారు. ఆ పోస్ట్ లో అఖిల్, జైనాబ్ ఉన్న ఫోటోను షేర్ చెయ్యడంతో పాటుగా మా కోడలు జైనాబ్ రావ్‌జీ అని మా కొడుకు అఖిల్ అక్కినేని నిశ్చితార్థం ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము.. ఈ అమ్మాయిని మా కుటుంబంలో కి ఆహ్వానించడం సంతోషంగా ఉంది.. మీరు యువ జంటను ఆశీర్వదించండి అని ఆ పోస్ట్ లో రాసుకొచ్చాడు.. త్వరలోనే ఎంగేజ్మెంట్ డేట్ ను అనౌన్స్ చెయ్యనున్నారని సమాచారం..

 

ఇక అఖిల్ కు గతంలో ఒకసారి నిశ్చతార్థం అయ్యిన విషయం తెలిసిందే.. అక్కినేని అఖిల్, శ్రియ భూపాల్‌ల ఎంగేజ్‌మెంట్ 2016 డిసెంబర్ 9న హైదరాబాద్‌లోని జీవీకే గెస్ట్‌హౌస్‌లో జరిగింది. అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్, ప్రముఖ వ్యాపారవేత్త జీవీ కృష్ణారెడ్డి (జీవీకే) మనవరాలు శ్రియ భూపాల్‌ల ఎంగేజ్మెంట్ సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది. అఖిల్, శ్రియ‌ల మధ్య రెండు సంవత్సరాలు ప్రేమ కథ నడిచింది. వారి వివాహానికి ఇటలీలో మేలో తేదీలు పెట్టుకున్నారు. అయితే, వారి వివాహం క్యాన్సిల్ అయ్యింది..ఆ తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ అఖిల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. దుబాయ్ మోడల్ జైనాబ్ రావ్‌జీ.. ఈ అమ్మాయి సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు కూడా నెట్టింట వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరి పెళ్లిని నాగార్జున ఆలస్యం లేకుండా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్. అటు నాగ చైతన్య – శోభితల పెళ్లి డిసెంబర్ 4 జరగబోతుంది. మరి ఇద్దరి పెళ్లి ఒకేసారి జరుగుతుందా? ముందు నాగ చైతన్య పెళ్లి చేసి తర్వాత అఖిల్ పెళ్లి చేస్తారా అనేది తెలియాల్సి ఉంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *