నటి, మాజీ మంత్రి ఆర్కే రోజా గురించి తెలుగు ప్రేక్షకులకు, ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రోజా.. ఫైర్ బ్రాండ్ అని అందరికి తెలుసు. అధికారంలో ఉన్నప్పుడు ఆమె నోటికి బలవ్వని ప్రతిపక్ష నేత లేడు అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా జనసేనఎం టీడీపీ నేతలను ఆమె ఎన్నోసార్లు బజారుకీడ్చింది.
ఇక ప్రస్తుతం రోజా అధికారంలో లేకపోవడంతో.. కొంతమంది ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. రోజా ఏం చేసినా దానిని నెగెటివ్ గా చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. తాజాగా ఈ ట్రోల్స్ పై, మార్ఫింగ్ ఫోటోలపై రోజా స్పందించింది. ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా మాట్లాడుతూ.. ” ఆడవాళ్లను అనవసరమైన వాటిలో లాగకూడదు. పొలిటికల్ గా నువ్వేమైనా మాట్లాడు.. రోజాగారు.. ఎమ్మెల్యేగా సరిగ్గా పని చేయలేదు. మంత్రిగా అవినీతి చేసింది. ఇలాంటివి చెప్పు.. నేను తిరిగి మాట్లాడతా. అంతేకాని వల్గర్ గా మాట్లాడడం, వల్గర్ పోస్టులు పెట్టడం.
నన్నే కాకుండా నా పిల్లలను కూడా. వాళ్లకేం తెలుసు .. వాళ్ళెక్కడో చదువుకుంటున్నారు. వాళ్ల ఇన్స్టాగ్రామ్ ఫోటోల కింద వల్గర్ కామెంట్స్ చేయడం, ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టడం. వాళ్లను అరెస్ట్ చేయమంటే చేయరు. ఇప్పటికీ చెప్తున్నా.. తప్పు చేస్తే నిరూపించండి. చేయనివారిని టార్గెట్ చేస్తే పిల్లి అయినా రూమ్ లో వేస్తే తిరగబడింది. ప్రజలు తరిమి కొడతారు. ఇలాంటి మార్ఫింగ్స్ లో నేను జీర్ణించుకోలేని రెండు సంఘటనలు ఉన్నాయి.
ఒకటి నా పుట్టినరోజున నా రెండో అన్నయ్య రామ్ ప్రసాద్ రెడ్డి. ఆయనే నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని, పెంచి పెద్ద చేసి, హీరోయిన్ గా ఉన్నప్పుడు నాతోనే ఉండి అంతా చూసుకున్నాడు. ఆయన నన్ను ముద్దు పెట్టుకుంటే.. దాన్ని ఎంత వల్గర్ గా చూపించారు అంటే నాకు ఏడుపు వచ్చేసింది. అలాగే నా కొడుకు కౌశిక్.. వాడు ఎప్పుడు నన్ను వెనుక నుంచి పట్టుకొని ఉంటాడు. మీరు ఏ ఫొటోలో చూసిన అలాగే కనిపిస్తుంది. వాటిలో నన్ను న్యూడ్ గా పెట్టి మార్ఫింగ్ చేశారు. వాడు ఆ విషయాన్నీ నాకు చెప్పలేక వారం రోజులు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. వాడికి కూడా తెలియదట.
ఎవరో ఫ్రెండ్ పంపిస్తే.. అది నాకు చెప్పలేక లోపల లోపలే కుమిలిపోయాడు. ఏంటి ఎప్పుడు లేనిది వీడు డల్ గా ఉన్నాడని అడిగితే అప్పుడు చెప్పాడు. వాళ్లు హార్ట్ అయితే వాళ్ల మనసు ఎటో వెళ్ళిపోతుంది. వాడికి 18 ఏళ్లు.. ఈ సమయంలో వాడి మనసుకు ఇలాంటివి వినిపిస్తే.. వాళ్ల డాడీకి కూడా చెప్పుకోలేకపోయాడు.
ఎవరికి చెప్పాలో తెలియలేదు. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. నేను ఎప్పుడు రాజకీయాలు వదిలి వెళ్ళాలి అనుకోలేదు. నేనెంటో నిరూపించుకోవాలి. నన్ను, నా ఫ్యామిలీని హార్ట్ చేసినవాడు.. ఏదో ఒకరోజు ఫీల్ అవ్వాలి. వాడి మనస్సాక్షికి నేను చేసింది తప్పు అని అనిపించాలి. బయట ఎవరు ఏమి అన్నా నేను ఎక్కువ ఫీల్ అవ్వను. కానీ, జీవితం మొత్తం నా కుటుంబంతోనే ఉండాలి. వాళ్లు హార్ట్ కాకుండా నేను చూసుకోవాలి” అంటూ రోజా కన్నీటి పర్యంతం అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.