J6@Times// జూన్ 7, 1974 న చెన్నైలో జనించిన మహేష్ భూపతి భారత దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు. టెన్నిస్ క్రీడలో భారతదేశానికి పేరు తెచ్చిన ఆటగాడు మహేష్ భూపతి. భారతదేశానికి ఒక గ్రాండ్ స్లాం టైటిల్ తెచ్చిపెట్టిన మొట్టమొదటి టెన్నిస్ క్రీడాకారుడు కూడా అతనే. 1997లోఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్లో జపాన్ కు చెందిన రికా హిరాకీతో కల్సి ఆడి మిక్స్‌డ్ డబుల్స్ లో విజయం సాధించాడు. 2001లో ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ లోనూ . 1999వింబుల్డన్ డబుల్స్ లోనూ లియాండర్ పేస్తో కల్సి ఆడి గెల్చాడు. గ్రాండ్‌స్లాంకు చెందిన నాల్గు టోర్నమెంట్లలోనూ ఫైనల్స్ చేరిన ఏకైక జంట వీరిది. 2002లోబుసాన్లో జరిగిన 14 వ ఆసియా క్రీడలలో లియాండర్ పేస్ మనదేశానికి బంగారు పతకం సాధించిపెట్టినాడు. 2006లో మహేష్ భూపతి మార్టినా హింగిస్తో కల్సి మిక్స్‌డ్ డబుల్స్ ఆడి గెల్చాడు. 2007లో చెక్ కు చెందిన ఆటగ్డితో కల్సి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడి అందులో క్వార్టర్ ఫైనల్ వరకు చేరినాడు. ఫ్రెంచ్ ఓపెన్ లో ఇతనితోనే ఆడి సెమీ ఫైనల్స్ వరకు చేరుకున్నాడు.