అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు హెచ్చరిక..!

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. 150 రోజుల కూటమి పాలన గురించి వివ రించారు. తమ లక్ష్యాలను వెల్లడించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు.. తప్పులు తమకు భారం గా మారాయని చెప్పుకొచ్చారు. ఒక్కోటి గాడిన పెడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రత లకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని.. ఎవ రైనా కరుడు గట్టిన నేరస్థులు ఉంటే వారి తాట తీస్తామని చంద్రబాబు హెచ్చరించారు.

 

అమలు చేస్తాం

ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు తన 150 రోజుల పాలన గురించి విశ్లేషించారు. రాష్ట్రం కష్టకాలంలో ఉన్న సమయంలో ప్రజలు పరిపక్వత ప్రదర్శించారని చెప్పుకొచ్చారు. ఏపీ చరిత్రలో ఎప్పుడూ చూడని ప్రజాతీర్పు వచ్చిందన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజల తిరుగుబాటు కనిపించిందని వ్యాఖ్యానించారు. సంక్షేమం ప్రారంభించిందే టీడీపీ అని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ రూ 4 వేలకు పెంచి అమలు చేస్తున్నామని గుర్తు చేసారు. ఆదాయం బాగా ఉన్న రాష్ట్రాల కంటే ఎక్కువ పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో ఆర్దిక నిర్వహణ లో చాలా అవకతవకలు జరిగాయని వివరించారు. గాడి తప్పిన పాలనను ఒక్కోటి సరి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పుకొచ్చారు.

 

బాధ కలిగించాయి

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు. రాత్రికి రాత్రి ఏదీ జరిగిపోదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం వెంటిలేటర్‌పైకి వెళ్లిందని పేర్కొన్నారు. ఢిల్లీలో పరపతి పెరిగిందని చెప్పిన చంద్రబాబు..ఏపీకి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తోందన్నారు. విజయవాడ వరదల సమయంలో సీఎం సహాయనిధికి రూ.500 కోట్లు విరాళంగా వచ్చాయని గుర్తు చేసారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు.. తప్పులు ఎంత తవ్వితే అన్ని తప్పులు బయటపడుతున్నాయని చంద్రబాబు వెల్లడించారు. తన కుటుంబంపై ఆరోపణలు చేశారని.. ఆ బాధ తట్టుకోలేక పోయానని చెప్పుకొచ్చారు. తనను జైలులో పెట్టిన అంశాన్ని చంద్రబాబు గుర్తు చేసారు.

 

అభివృద్ధి చేస్తాం

పేదల కోసం అనేక సంస్కరణలు, పథకాలు తీసుకొచ్చామని వెల్లడించారు. పేదలకు పక్కా ఇళ్లు నిర్మించిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. టీడీపీ పాలనలో 120 సంక్షేమ పథకాలు ప్రారంభించామని తెలిపారు. ఏపీలో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం తనకు ఉందని చంద్రబాబు వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలో 101 అన్నా క్యాంటీన్‌లు నడుస్తున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు కూడా స్పందించారన్నారు. ఏపీలో బుక్‌ చేసుకున్న వారందరికీ గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తున్నామని వివరించారు. అమరావతికి పూర్వవైభవం తీసుకువస్తామని స్పష్టం చేశారు. పెట్టుబడులు ఆకర్షించడానికి చేయాల్సిన పనులు చేస్తున్నామన్నారు. సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు తయారుచేస్తామని వెల్లడించారు. అమరావతితో పాటుగా రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *