ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెలుగు హీరోల హవా నడుస్తోంది. ‘బాహుబలి’తో మొదలైన ఈ ట్రెండ్ నిన్న వచ్చిన ‘దేవర’ వరకు కొనసాగుతూనే ఉంది. దీని వల్లే పాన్ ఇండియా లెవెల్‌లో మోస్ట్ హైప్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ‘పుష్ప 2’కు క్రేజ్ మరింత పెరిగింది. పార్ట్ 1తో నార్త్‌లో కలెక్షన్లు మోత మోగించిన అల్లు అర్జున్.. డిసెంబర్ మొదటి వారంలో పార్ట్ 2తో ధియేటర్లలో సందడి చేయనున్నాడు. ‘పుష్ప 2’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరయిన ప్రేక్షకుల సంఖ్య చూస్తుంటే ఈ మూవీకి ఎంత హైప్ క్రియేట్ అయ్యిందో చెప్పేయొచ్చు. అందుకే ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి మేకర్స్ పూర్తిస్థాయిలో ఫిక్స్ అయ్యి ఉన్నారు. దానికి వారు పెంచిన టికెట్ ధరలే ఉదాహరణ.
రికార్డ్ ధరలు
గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమాలకు టికెట్ ధరలు పెంచడం కామన్ అయిపోయింది. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో మూవీ తెరకెక్కితే చాలు.. అది ఏ భాష అని సంబంధం లేకుండా ప్రతీ రాష్ట్రంలో దానికి టికెట్ ధరలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో సినిమా వారికే ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. అదే విధంగా ‘పుష్ఫ 2’కు టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ అని తేడా లేకుండా అన్నింటిలో ‘పుష్ప 2’ టికెట్ రేట్లు ఓ రేంజ్‌లో ఉండనున్నాయని సమాచారం.
మరీ అంత?
‘పుష్ప 2’ (Pushpa 2) టికెట్ ధరలు పెరగడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ట్రెండ్‌ను బట్టి తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్‌లో ఒక్క సింగిల్ టికెట్ ధర దాదాపు రూ.700 వరకు ఉండవచ్చని టాక్ వినిపిస్తుండగా ఇక సింగిల్ స్క్రీన్‌లో చూస్తే ఒక్క టికెట్ ధరే రూ. 300కి పెంచే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. సాధారణంగా మల్టీప్లెక్స్‌ల్లో సాధారణ ధరే 300 నుంచి 350 ఉంటుంది. అంతేకాకుండా ‘పుష్ప 2’ను 3డీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం అదనంగా ఇచ్చే హైక్‌లు వాటికి తోడు 3డి గ్లాసెస్ ఛార్జ్‌లు కలిపి దాదాపు రూ. 700 ఉంటుందట.
టార్గెట్ పెద్దదే
‘పుష్ప 1’ తెలుగు మాత్రమే కాకుండా నార్త్ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా రూ.300 కోట్లకు పైగానే వసూలు చేసింది. ప్రస్తుతం వస్తున్న పార్ట్ 2 ఓ రేంజ్ హైప్ రావడంతో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు వెయ్యి కోట్లు జరిగినట్టు టాక్ వినిపిస్తోంది. సుమారు ధియేటర్ల నుంచి 600 కోట్లు రాబాట్టాల్సి ఉంటుందని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ‘పుష్ప 2’ టికెట్ ధరలను భారీ పెంచే అవకాశాల ఉన్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై ఇంకా మూవీ టీమ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈ రేంజ్‌లో టికెట్ ధరలు పెరిగితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ థియేటర్లకు వచ్చి ‘పుష్ప 2’ చూడడం కష్టమే అని కామన్ ఆడియన్స్ అనుకుంటున్నారు.