రోడ్ల పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!

ఏపీలో గ్రామీణ రహదారుపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో జాతీయ రహదారులు మినహాయిస్తే రాష్ట్ర రహదారులు, ముఖ్యంగా గ్రామీణ రహదారులు దారుణంగా ఉన్నాయి. వీటిపై గుంతల్ని పూడ్చేందుకు ఈ మధ్యే పాట్ హోల్ ఫ్రీ ఏపీ పేరుతో ప్రభుత్వం ఓ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం ప్రకటించారు. ఇకపై జాతీయ రహదారుల తరహాలో గ్రామీణ రహదారుల్ని కూడా అభివృద్ధి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

 

రాష్ట్రంలో రహదారుల పరిస్ధితి దృష్ట్యా వీటి నిర్వహణను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు ఇవాళ అసెంబ్లీలో ప్రకటించారు. అయితే తొలుత దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ముందుగా ఈ ప్రయోగం చేయనున్నారు. విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించబోతున్నారు. అలాగే వీటిపై టోల్ ఫీజు కూడా వసూలు చేయబోతున్నారు.

 

రాష్ట్రంలోని అన్ని గ్రామీణ, మండల, రాష్ట్ర రహదారుల్ని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించేలా ప్రభుత్వం త్వరలో పైలట్ ప్రాజెక్టుగా ఇవ్వబోతోంది. ఉభయ గోదావరి జిల్లాల నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమంలో గ్రామాల నుంచి మండల కేంద్రాల వరకూ వెళ్లే రహదారులపై మాత్రం టోల్ ఫీజు వసూలు చేయరు. మిగతా రోడ్లకు మాత్రం టోల్ ఫీజు వసూలు చేస్తారు. అయితే బస్సులు, కార్లు, లారీలకు మాత్రమే ఈ టోల్ ఫీజు వసూలు చేయబోతున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నాక పనులు అప్పగించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *