శాంతి భద్రతలు ఇష్యూ, సభ్యులు వాకౌట్.. దమ్ముంటే నిలబడాలంటూ..

రాష్ట్రంలో శాంతిభద్రతలపై శాసన మండలిలో చర్చ జరిగింది. ఒకానొక దశలో ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. ఈలోగా హోంమంత్రి అనిత ఇచ్చిన సమాధానం తో సంతృప్తి చెందిన విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అసలేం జరిగింది. ఇంకా డీటేల్స్‌లోకి వెళ్తే..

 

మండలి సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో శాంతి భద్రతలపై చిన్నపాటి చర్చ జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత వివరాలను సభ ముందు ఉంచారు. దీనిపై వైసీపీ సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు.

 

ముచ్చుమర్రి కేసు, అత్తా కోడలు రేప్ కేసు వంటి అంశాలు మండలిని కుదిపేశాయి. దిశ యాప్, చట్టం గురించి వైసీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలపై హోంమంత్రి అనిత తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. 2014-19 మధ్యకాలంలో 83 వేల కేసులు నమోదు కాగా, 2019-24 మధ్య కాలంలో లక్షా 508 కేసులు నమోదు అయినట్టు హోంమంత్రి అనిత తెలిపారు.

 

దాదాపు 20.8 శాతం కేసులు వైసీపీ హయాంలో పెరిగాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైమ్ రేటు క్రమంగా తగ్గుతోందన్నారు. మహిళ భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. గతంలో సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లు మూడు మాత్రమే ఉండేవని, ఇప్పుడు జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

 

ప్రతీది రాజకీయ విమర్శలు చేయడం తగదని వైసీపీ సభ్యులకు హితవు పలికారు హోంమంత్రి అనిత. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నుంచి ఇప్పటివరకు జరిగిన ఘటనలకు సంబంధించి 24 గంటల నుంచి 48 గంటల లోపు దాదాపుగా నిందితులను అరెస్ట్ చేశామన్నారు. వారందర్నీ రిమాండ్‌కు తరలించామన్నారు.

 

ముచ్చుమర్రి విషయంలో ఆమె ఐడెంటిఫికేషన్ కాలేదన్నారు. ఐదునెలల్లో పోలీసుల వద్ద సదుపాయాలు లేకపోయినా, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. గడిచిన ఐదేళ్లు పోలీసులు ఎక్కడున్నారని ప్రశ్నించారు హోంమంత్రి.

 

దిశ చట్టం, యాప్ గురించి మాట్లాడుతున్నారని, అసలు దిశ చట్టం ఉందా? చట్టబద్దత ఉందా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు మంత్రి. వైసీపీ హయాంలో పోలీసులకు ఓ రేపిస్టు ఛాలెంజ్ విసిరిన విషయం గుర్తు లేదా అంటూ ప్రశ్నించారు. వైసీపీ హయాంలో అప్పటి సీఎం ఇంటి సమీపంలో జరిగిన గ్యాంగ్ రేసు ఘటన గురించి ప్రస్తావించారు.

 

దిశ యాప్ అనేది గత టీడీపీ ప్రభుత్వం ఫోర్త్ లైన్ పేరిట యాప్ తీసుకొచ్చిందని, దాన్ని కన్వెర్ట్ చేసి దిశ యాప్‌గా మార్చారన్నారు మంత్రి. దిశ చట్టం వచ్చిన తర్వాత చాలా మందిని పట్టుకున్నామని గత ప్రభుత్వం చెబుతోందని, అలాంటప్పుడు నేరాలు ఎందుకు పెరిగాయని సూటిగా ప్రశ్నించారు మంత్రి.

 

లేని దిశ చట్టం గురించి మాట్లాడుతున్నారని, నిర్భయం చట్టం కింద కేసులు పెట్టడానికి ఎందుకు ముందుకు రాలేదన్నారు. కనీసం అమరావతిలో ల్యాబ్ లేకుండా చేశారన్నారు. ల్యాబ్ పూర్తయితే వుంటే నిందితులకు నాలుగైదు నెలల్లో శిక్షలు పడేవన్నారు.

 

ఈ క్రమంలో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకున్నారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు హోం మంత్రి అనిత సరిగా సమాధానం చెప్పలేదని, రాజకీయ ఉపన్యాసం చేశారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

 

వెంటనే జోక్యం చేసుకున్న హోంమంత్రి అనిత.. దమ్మంటే నిలబడాలంటూ వ్యాఖ్యానించారు. వినే ఓపిక లేక సభ నుంచి వాకౌట్ చేస్తున్నారని అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై ఛైర్మన్ జోక్యం చేసుకున్నారు. మంత్రిగా ఉన్న మీరు దమ్ము, ధైర్యం అనే పదాలు వాడడం కరెక్ట్ కాదన్నారు. తప్పు తెలుసుకున్న హోంమంత్రి అనిత, క్షమాపణలు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *