నవంబర్ 19న వరంగల్ కు సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజాపాలన విజయోత్సవ సభ..!

కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కాళోజీ కళాక్షేత్రం ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

 

వరంగల్ వేదికగా ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం శంకుస్థాపన

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అనేక జిల్లాలలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి నవంబర్ 19న వరంగల్ లో మహిళా స్వయం సహాయక బృందాలు, జిల్లా సమైఖ్య సభ్యులు, గ్రామ సమైఖ్య సభ్యులకు వివిధ శాఖల వారీగా ఆస్తులను పంపిణీ చేయనున్నారు. 19న వరంగల్ వేదికగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు.

 

సీఎం పర్యటనకు ఏర్పాట్లు

కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో ఇళ్ళ కోసం 5 లక్షల రూపాయలను అందిస్తారు. సీఎం పర్యటన నేపధ్యంలో వరంగల్, హన్మకొండ జిల్లా కలెక్టర్లు రూట్‌ మ్యాప్‌, వేదిక ఏర్పాట్లు, పార్కింగ్‌ తదితర లాజిస్టిక్‌ అంశాలపై ఎప్పటికప్పుడు అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ పర్యవేక్షిస్తున్నారు.

 

ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చెప్పాలన్న వేం నరేందర్ రెడ్డి

కాగా సీఎం వరంగల్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులకు దిశానిర్థేశం చేశారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం గతేడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు విజువల్స్ ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు.

 

ప్రజా పాలన విజయోత్సవ సభకు విస్తృత ప్రచారం కల్పించాలి

గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం చేయాలని పేర్కొన్నారు. 19న వరంగల్‌లో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన, ప్రజా పాలన విజయోత్సవ సభ గురించి ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కోరారు. అధికారులంతా సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.

 

ఏడాదిలో తెలంగాణాను రోల్ మోడల్ గా చేసిన రేవంత్ రెడ్డి

ఏడాది కాలంలో తెలంగాణను దేశంలోనే రోల్ మోడల్ గా నిలిపారని, తెలంగాణా ప్రగతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా వేలాది కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులే నిదర్శమని చెప్పారు. మొత్తంగా సీఎం పర్యటన సక్సెస్ చెయ్యాలని, ప్రజాపాలన విజయోత్సవాలను ప్రజలలోకి తీసుకు వెళ్లాలని, ప్రజలకు ప్రభుత్వం చేసిన మంచిని అర్ధమయ్యేలా చెప్పాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *