మహారాష్ట్రలో నవంబరు 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం తనిఖీలు ముమ్మరం చేసింది. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్ ను తనిఖీ చేసిన ఈసీ… నేడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్ లో సోదాలు చేపట్టింది.
మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేసేందుకు రాహుల్ గాంధీ హెలికాప్టర్ లో వచ్చారు. అయితే, ఎన్నికల అధికారుల బృందం హెలికాప్టర్ వద్దకు వెళ్లి నిబంధనల ప్రకారం తనిఖీ చేపట్టింది. దాంతో, రాహుల్ తన బాడీగార్డులతో కలిసి అక్కడ్నించి దూరంగా వెళ్లారు. పార్టీ నేతలతో మాట్లాడుతూ కనిపించారు.
ఈ క్రమంలో అధికారులు రాహుల్ గాంధీ బ్యాగ్ ను నిశితంగా సోదా చేశారు. తనిఖీల అనంతరం రాహుల్ ప్రచార కార్యక్రమాలు కొనసాగించారు.