రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం ఫామ్ హౌస్ కే ప‌రిమిత‌మైంది.. పీసీసీ ఛీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ సంచ‌ల‌నం..!

గ‌త ప‌దేళ్లపాల‌న కంటే ప‌ద‌కొండు నెల‌ల్లో మెరుగైన పాల‌న అందించామ‌ని తెలంగాణ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ అన్నారు. వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లా నేత‌ల‌తో మ‌హేశ్ కుమార్ గౌడ్ స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డానికి ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ముఖ్య పాత్ర పోశించింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. పోరాటాల‌కు, చైతన్యానికి వ‌రంగ‌ల్ మారు పేరు అని కొనియాడారు. ఈనెల 19న వ‌రంగ‌ల్ లో నిర్వ‌హించబోయే మ‌హిళా స‌ద‌స్సులో ల‌క్షమంది మ‌హిళ‌లు పాల్గొంటార‌ని అన్నారు.

 

ఈ సద‌స్సులో 11 నెల‌ల ప్ర‌జాపాల‌న‌ను సీఎం వివ‌రిస్తార‌ని చెప్పారు. ప్ర‌త్యేక రాష్ట్రంలో అభివృద్ధి జ‌రుగుతుంద‌ని ప్ర‌జ‌లు అనుకున్నార‌ని కానీ కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల‌పాలు చేశార‌ని మండిప‌డ్డారు. కేసీఆర్ పాల‌న‌లో భూముల దోపిడీ అంతా ఇంతా కాద‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో విద్యా విధానం మారాల‌నే యంగ్ ఇండియా స్కూళ్ల‌ను తీసుకువ‌చ్చామ‌ని చెప్పారు. దేశానికి ఆద‌ర్శంగా ఉండేలా వైద్య రంగంలో మార్పులు తీసుకువ‌స్తున్నామ‌ని అన్నారు. ప్ర‌తిప‌క్షాలు బ‌లంగా ఉండాల‌ని కాంగ్రెస్ కోరుకుంటుంద‌ని కానీ బీఆర్ఎస్ ఫామ్ హౌస్ కే ప‌రిమిత‌మైంద‌ని ఆరోపించారు. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం కూడా లేకుండా పోయింద‌ని విమ‌ర్శించారు.

 

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీనే ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. బీజేపీ కుల‌మ‌తాల పేరుతో రాజ‌కీయాలు చేస్తూ ఉనికి కోసం ప్ర‌య‌త్నిస్తోంద‌ని చెప్పారు. తొమ్మిది నెల‌ల్లోనే 48వేల ఉద్యోగాలు ఇచ్చామ‌ని చెప్పారు. ప‌దేళలో బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాల కంటే తమ ప్ర‌భుత్వం తొమ్మిది నెల‌లో ఇచ్చిన ఉద్యోగాలే ఎక్కువ అని అన్నారు. ప‌దేళ్ల‌లో బీఆర్ఎస్ యాభైవేల ఉద్యోగాలు మాత్ర‌మే ఇచ్చింద‌ని ఆరోపించారు. ఆ లెక్కన తాము ఒకే ఏడాది అన్ని ఉద్యోగాలు ఇవ్వ‌గ‌లిగామ‌ని చెప్పారు. ప్ర‌త్యేక రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్ర‌మే బంగారుమయం అయింద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *