దేశంలో గడచిన కొన్ని వారాలుగా పెరిగిన ఉల్లి ధరలు సామాన్యులను కన్నీరు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలో కేజీ ధర చాలా చోట్ల ఇటీవల దేశంలో రూ.70-80 స్థాయిలకు చేరాయి. అయితే ప్రస్తుతం ధరలు మళ్లీ క్రమంగా దిగి రావటంతో సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే అతి త్వరలోనే అధిక ఉల్లి ధరల నుంచి వీరికి ఉపశమనం లభిస్తుందని తెలుస్తోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సగటున కేజీ ఉల్లి ధర రూ.54కి సమీపంలో ఉంది. గడచిన నెలతో పోల్చితే ప్రస్తుతం ధరలు తగ్గాయి. తాజా ఖరీఫ్ పంటల రాక ప్రారంభమైనందున రానున్న రోజుల్లో ఉల్లి ధరలు మరింత తగ్గుతాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. ఉల్లి ఆల్-ఇండియా రిటైల్ ధర కిలోకు రూ.54గా ఉంది. ప్రభుత్వం ప్రధాన వినియోగ కేంద్రాల్లో ఉల్లిని సబ్సిడీపై విక్రయించిన తర్వాత గత ఒక నెలలో ధరలు తగ్గుముఖం పట్టాయని అధికారి తెలిపారు. అధిక ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం దిల్లీ-ఎన్‌సీఆర్, ఇతర నగరాల్లో రిటైల్ మార్కెట్‌లో కిలోకు రూ.35 సబ్సిడీ రేటుతో బఫర్ స్టాక్ ఉల్లిని తొలగిస్తోంది.
హైదరాబాదులో ప్రస్తుతం ఉల్లి ధర కేజీకి దాదాపు రూ.65-70 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద 4.5 లక్షల టన్నుల ఉల్లి బఫర్ స్టాక్ ఉంది. అందులో ఇప్పటి వరకు 1.5 లక్షల టన్నులు విడుదల చేయబడ్డాయి. బఫర్ స్టాక్ ఉల్లిని మొదటిసారిగా రైల్వేల ద్వారా కీలక వినియోగ కేంద్రాలకు రవాణా చేయబడుతోందని అధికారులు వెల్లడించారు. సరఫరాను పెంచడంలో ఈ ఆలోచన సహాయపడింది. మార్కెట్లో ధరలను స్థిరీకరించబడే వరకు బఫర్ స్టాక్ ఉల్లిని బల్క్ రైళ్ల ద్వారా సరఫరాను కొనసాగిస్తామని అధికారి వెల్లడించారు.
దిల్లీ, చెన్నై, గుహవతికి గత కొన్ని వారాల్లో సుమారు 4,850 టన్నుల ఉల్లి రైళ్ల ద్వారా సరఫరా చేశారు. గరిష్ఠంగా 3,170 టన్నుల ఉల్లి ధరలను తగ్గింపులో భాగంగా దిల్లీ మార్కెట్‌కు రవాణా చేయబడింది. పండుగ సీజన్ కారణంగా మండీలు మూసివేయడం, కార్మికులు సెలవులో ఉన్నందున గత రెండు రోజులుగా ఉల్లి ధరలపై అకస్మాత్తుగా ఒత్తిడి పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లలోకి తిరిగి కొత్త పంట రావటం ప్రారంభం కావటంతో ధరలు తగ్గుతున్నుయని అధికారులు చెబుతున్నారు. ఇదే క్రమంలో ఉత్పత్తి కూడా ఎక్కువగానే ఉంటుందని వారు చెబుతున్నారు. రోజువారీ ఉల్లి వినియోగం తెలుగు రాష్ట్రాల్లో అధికంగానే ఉంటుంది. త్వరలో మండీల్లోకి రానున్న ఖరీఫ్ సీజన్ స్టాక్ ప్రజలపై ధరల భారాన్ని తగ్గిస్తుందని వ్యాపారులు సైతం అంటున్నారు.